ఇతర గ్రహాల మీద ఆక్సిజన్‌ కొరతకు చెల్లు!

చంద్రుడి మీద, అంగారకుడి మీద ఆవాసం ఏర్పాటు చేసుకోవాలనే కల ఈనాటిది కాదు. కానీ అక్కడ అక్సిజన్‌ ఉండదు. మరెలా? మనిషి మనుగడ సాగించేదెలా? దీనికి శాస్త్రవేత్తలు ఇటీవలే ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు!

Updated : 02 Mar 2022 06:19 IST

చంద్రుడి మీద, అంగారకుడి మీద ఆవాసం ఏర్పాటు చేసుకోవాలనే కల ఈనాటిది కాదు. కానీ అక్కడ అక్సిజన్‌ ఉండదు. మరెలా? మనిషి మనుగడ సాగించేదెలా? దీనికి శాస్త్రవేత్తలు ఇటీవలే ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు!

నీటిలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ ఉంటాయి కదా. వీటిని విడగొడితే ఆక్సిజన్‌ లభించదా? వాటర్‌ ఎలక్ట్రోలైసిస్‌ ప్రక్రియ చేసే పని ఇదే. నీటి అణువులను విడగొట్టి ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ను వేరుచేస్తుంది. అయితే ఈ ప్రక్రియ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే ఇతర గ్రహాల్లో పనిచేస్తుందా? లేదా? అన్నదే పెద్ద సందేహం. తాజాగా శాస్త్రవేత్తలు దీన్ని పటాపంచలు చేశారు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నా వాటర్‌ ఎలక్ట్రోలైసిస్‌ ప్రక్రియ పనిచేస్తున్నట్టు గుర్తించారు. చంద్రుడి వంటి గురుత్వాకర్షణ పరిస్థితుల్లో దీని సామర్థ్యం 11% మాత్రమే తగ్గుతున్నట్టు కనుగొన్నారు. అంగారకుడి మీద గడ్డకట్టిన నీరు ఉన్నా కూడా ఇది దాన్నుంచి ఆక్సిజన్‌ను పుట్టించగలదు! ఇతర గ్రహాల యానం కోసం ప్రయత్నిస్తున్న వారికిది శుభవార్త అనటంలో ఎలాంటి సందేహం లేదు. స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఈ దశాబ్దంలోనే అంగారకుడి మీదికి మనుషులను పంపించాలని, 2050కల్లా అక్కడ ఓ కాలనీనే స్థాపించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు