WhatsApp: వాట్సాప్‌లో ఇవి కొందరికి తెలుసు.. కొందరికి తెలియవు.. మీకు తెలుసా?
వాట్సప్‌లో చాలా ఫీచర్లున్నాయి. కొన్ని యాప్‌ను ఓపెన్ చేయగానే కనిపిస్తాయి. కానీ కొన్ని ఫీచర్లు మేసేజ్‌లను కాసేపు అలాగే నొక్కి పడితే, మూడు చుక్కల మెనూను ఓపెన్ చేస్తే గానీ కనిపించవు.
వాట్సప్‌లో చాలా ఫీచర్లున్నాయి. కొన్ని యాప్‌ను ఓపెన్ చేయగానే కనిపిస్తాయి. కానీ కొన్ని ఫీచర్లు మేసేజ్‌లను కాసేపు అలాగే నొక్కి పడితే, మూడు చుక్కల మెనూను ఓపెన్ చేస్తే గానీ కనిపించవు. చాలాకాలంగా వాట్సప్ వాడేవారిలో కొందరికి వీటి గురించి తెలిసే ఉంటుంది. కొత్తగా వాడేవారికి మాత్రం వింతగానే అనిపిస్తాయి. అలాంటి అదృశ్య ఫీచర్లలో కొన్ని ఇవి.
ముఖ్యమైన ఛాట్ పైభాగాన
వాట్సప్‌లో ఎన్నో ఛాట్లు. వీటిల్లో కొన్ని ముఖ్యమైనవి కావచ్చు. ఏవేవో మెసేజ్‌లు వస్తున్నప్పుడు ఇవి కిందికి వెళ్లిపోవచ్చు. అప్పుడు వెంటనే వీటిని చూడలేకపోవచ్చు. ముఖ్యమైన ఛాట్లను అన్నింటికన్నా పైన ఉండేలా చూసుకుంటే ఇలాంటి ఇబ్బందిని తప్పించుకోవచ్చు. ఇందుకు ఛాట్‌ను పిన్ చేసుకునే ఫీచర్ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత ఛాట్ అయినా గ్రూప్ ఛాట్ అయినా.. దేన్నయినా పిన్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్ హోంస్క్రీన్‌లోకి వెళ్లి పిన్ చేయాలనుకుంటున్న ఛాట్ మీద కాసేపు అలాగే నొక్కి పట్టుకోవాలి. అప్పుడు పైన కొన్ని గుర్తులు కనిపిస్తాయి. వీటిల్లో పిన్ గుర్తును ఎంచుకొని ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా మూడు ఛాట్ల వరకు పిన్ చేసుకోవచ్చు. ఇలా ముఖ్యమైన ఛాట్లు ఎప్పుడూ పైన ఉండేలా చూసుకోవచ్చు.
* ఐఫోన్లలో అయితే ఛాట్‌ను కుడివైపునకు స్వైప్ చేస్తే పిన్ గుర్తు కనిపిస్తుంది.
చదవని వాటికి గుర్తు
ఏదో మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేశారు గానీ అప్పటికి చదవటం కుదరలేదు. తర్వాత చూద్దామని అనుకోవచ్చు. పనుల్లో పడిపోయి మరచిపోతే? తర్వాత దాని వంకే చూడకపోతే? అవి ముఖ్యమైన మెసేజ్‌లైతే ఇరకాటంలో పడటం ఖాయం. అందుకే తర్వాత చదువుదామని అనుకునే మెసేజ్‌లను మార్క్ చేసి పెట్టుకోవటానికీ వాట్సప్‌లో వీలుంది. హోంస్క్రీన్‌లోకి వెళ్లి, ఛాట్ మీద కాసేపు నొక్కి పట్టాలి. తర్వాత పైన కుడివైపున కనిపించే మూడు నిలువుగీతల మెనూను క్లిక్ చేయాలి. అందులో ‘మార్క్ అన్‌రీడ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు ఛాట్ పక్కన ఆకుపచ్చ చుక్క ప్రత్యక్షమవుతుంది. సమయం దొరికినప్పుడు మెసేజ్‌ను చదవగానే ఆకుపచ్చ చుక్క అదృశ్యమవుతుంది.
నోటి మూత
ఏదైనా గ్రూప్ లేదా వ్యక్తుల నుంచి అదేపనిగా, అతిగా నోటిఫికేషన్స్ వస్తున్నాయా? ఇవి చికాకు కలిగిస్తున్నాయా? ఇలాంటి ఇబ్బంది పడకుండా వాటిని మ్యూట్ చేసుకోవచ్చు. ఛాట్ మీద కాసేపు నొక్కి పెడితే, పైన స్పీకర్ మీద అడ్డం గీత ఉన్న గుర్తు కనిపిస్తుంది. దీన్ని నొక్కి ఎన్నిరోజుల వరకు మ్యూట్‌లో ఉండాలో ఎంచుకోవచ్చు. కావాలంటే శాశ్వతంగా మ్యూట్ చేసుకోవచ్చు. ఛాట్‌ను ఓపెన్ చేసి, పైన కుడివైపున మూడు చుక్కల మెనూను నొక్కినా ‘మ్యూట్ నోటిఫికేషన్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఆయా ఛాట్స్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు అందవు.
ఆర్కైవ్‌తో విడిగా
మ్యూట్ చేసుకోవటంతో సంతృప్తి చెందకపోతే ఛాట్‌ను ఆర్కైవ్ చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇది శాశ్వతంగా ఛాట్‌ను విడిగా ఉంచుతుంది. రివర్స్ చేసుకుంటే గానీ తిరిగి ప్రధాన విభాగంలో కనిపించదు. ఇందుకోసం మెయిన్ స్క్రీన్‌లో ఛాట్ మీద కాసేపు నొక్కి పట్టాలి. కిందికి చూస్తున్న బాణంతో కూడిన చదరపు గుర్తును క్లిక్ చేయాలి. దీంతో ఛాట్ ఆర్కైవ్ అవుతుంది. ఇది ఛాట్ విభాగంలో అన్నింటికన్నా కింద ఆర్కైవ్ విభాగంలో ఉండిపోతుంది. దీన్ని మళ్లీ యథావిధిగా చూసుకోవాలంటే ఛాట్ కిందికి వెళ్లి ‘ఆర్కైవ్డ్’ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఛాట్ మీద కాసేపు నొక్కి పట్టాలి. పైకి చూస్తున్న బాణంతో కూడిన చదరపు గుర్తును క్లిక్ చేయాలి.
నక్షత్రం గుర్తు
చిరునామాలు, లొకేషన్ల వంటి వివరాలతో కూడిన ముఖ్యమైన ఛాట్స్ ఎక్కడో అడుగున పడిపోతే వెతుక్కోవటం కష్టం. వీటిని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవటానికి మార్గం లేకపోలేదు. అదే నక్షత్రం గుర్తు. దీంతో ముఖ్యమైన ఛాట్స్‌ను బుక్‌మార్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకేచోట ఉండేలా చూసుకోవచ్చు. టెక్స్ట్, ఇమేజ్, లింక్, ఆడియో.. ఎలాంటి మెసేజ్‌ల మీదైనా కాసేపు అలాగే నొక్కి పట్టాలి. ఛాట్ పైభాగాన కనిపించే నక్షత్రం గుర్తును క్లిక్ చేయాలి. ఇలా ఎన్ని మెసేజ్‌లనైనా మార్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ ‘స్టార్డ్ మెసేజ్స్’ విభాగంలో ఉంటాయి. హోంస్క్రీన్‌లో కుడివైపున నిలువు మూడు గీతల మెనూను నొక్కి దీనిలోకి వెళ్లొచ్చు. నక్షత్రం గుర్తుతో కూడిన మెసేజ్‌లు అన్నింటినీ చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. -
నవ ఫీచర్ల వాట్సప్
నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్, వెబ్ వర్షన్లలో యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్ క్లయింట్ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. -
తాత్కాలిక మెయిల్ కోసం
ఖాళీ సమయంలో గిగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. -
ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. -
వీడియో కాల్ చేస్తున్నా సంగీతం వినొచ్చు
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.