పీడీఎఫ్‌ ఫైళ్లు జేపీజీలుగా..

ట్విటర్‌ వంటి కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోల మాదిరిగా నేరుగా పీడీఎఫ్‌ పేజీలను షేర్‌ చేయటం సాధ్యం కాదు. అందుకే కొందరు స్క్రీన్‌ షాట్లను తీసి అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇవి అంత స్పష్టంగా కనిపించవు.

Updated : 11 May 2022 18:32 IST

ట్విటర్‌ వంటి కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోల మాదిరిగా నేరుగా పీడీఎఫ్‌ పేజీలను షేర్‌ చేయటం సాధ్యం కాదు. అందుకే కొందరు స్క్రీన్‌ షాట్లను తీసి అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇవి అంత స్పష్టంగా కనిపించవు. కొందరైతే పీడీఎఫ్‌ ఫైళ్లను ముందుగా బ్లాగ్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ వంటి వాటికి జతచేసి.. లింకుల ద్వారా షేర్‌ చేస్తుంటారు. ఇదో పెద్ద తతంగం. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా తేలికగా పీడీఎఫ్‌లను షేర్‌ చేసుకునే మార్గమేదీ లేదా? ఎందుకు లేదు? పీడీఎఫ్‌ ఫైళ్లను జేపీజీ ఇమేజెస్‌గా మార్చుకుంటే సరి.

విండోస్‌ వాడేవారైతే- ‘ఎనీ పీడీఎఫ్‌ టు జేపీజీ’ యాప్‌తో తేలికగా చేసుకోవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుని, ఓపెన్‌ చేయాలి. అప్పుడు ‘లోడ్‌ పీడీఎఫ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేసి ఫైల్‌ను ఎంచుకొని, ‘సేవ్‌ ఇమేజ్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి. తెర మీద చూస్తున్న పేజీనా? ఫైల్‌లోని అన్ని పేజీలా? లేకపోతే ఆయా పేజీలనేనా? వేటిని ఇమేజ్‌గా మార్చాలని అడుగుతుంది. వీటిల్లో అవసరమైన బాక్స్‌ను ఎంచుకోవాలి. అలాగే స్కేల్‌ ఆప్షన్‌ను కూడా ఎంచుకొని ‘కంటిన్యూ’ బటన్‌ను నొక్కాలి. అంతే.

మ్యాక్‌లోనైతే- ఎలాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ అవసరం లేదు. ఒక పీడీఎఫ్‌ పేజీని జేపీజీ ఇమేజ్‌గా మార్చుకోవాలనుకుంటే.. ఫైల్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి, ‘ఓపెన్‌ విత్‌’ ఆప్షన్‌ ద్వారా ‘ప్రివ్యూ’ను ఎంచుకోవాలి. ప్రివ్యూ యాప్‌లో ఇమేజ్‌గా సేవ్‌ చేయాలని అనుకుంటున్న పేజీ వరకు స్క్రోల్‌ చేయాలి. తర్వాత పైన ఎడమ మూలన కనిపించే ‘ఫైల్‌’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసి.. డ్రాప్‌ డౌన్‌ మెనూలో కిందికి వచ్చి, ‘ఎక్స్‌పోర్ట్‌’ బటన్‌ను నొక్కాలి. అనంతరం జేపీజీ ఫార్మాట్‌ను ఎంచుకోవాలి. ఫైల్‌ రెజల్యూషన్‌, కంప్రెషన్‌ మోతాదులనూ సెలెక్ట్‌ చేసుకొని, ‘సేవ్‌’ మీద క్లిక్‌ చేయాలి. 

* మొత్తం పీడీఎఫ్‌ ఫైళ్లను త్వరగా వేర్వేరు జేపీజీ ఇమేజెస్‌గా మార్చుకోవాలనుకుంటే మాత్రం మ్యాక్‌లో బిల్టిన్‌గా వచ్చే ఆటోమేటర్‌ టూల్‌ను వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని