ఇంజిన్యూటీ 25వ సారి!

అంగారకుడి మీదికి పర్‌సివియెరెన్స్‌ రోవర్‌తో పాటు పంపించిన మినీ హెలికాప్టర్‌ ‘ఇంజిన్యూటీ’ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐదుసార్లు మాత్రమే అంగారకుడి మీద ఎగరగలదని భావించిన ఇది తాజాగా 25వ ప్రయాణాన్ని పూర్తిచేసింది....

Published : 20 Apr 2022 01:53 IST

అంగారకుడి మీదికి పర్‌సివియెరెన్స్‌ రోవర్‌తో పాటు పంపించిన మినీ హెలికాప్టర్‌ ‘ఇంజిన్యూటీ’ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐదుసార్లు మాత్రమే అంగారకుడి మీద ఎగరగలదని భావించిన ఇది తాజాగా 25వ ప్రయాణాన్ని పూర్తిచేసింది. కేవలం 1.8 కిలోల బరువు గల ఈ హెలికాప్టర్‌ ఇటీవల 704 మీటర్ల దూరం అంగారకుడి వాతావరణంలో ఎగిరింది. తొమ్మిదో ప్రయాణంలో సృష్టించిన రికార్డు కన్నా ఇది 80 మీటర్లు అధికం. సెకండుకు 5.5 మీటర్ల వేగంతో దూసుకు పోవటం మరో రికార్డు. అంగారకుడి వాతావరణంలో ఇది సుమారు 161.5 సెకండ్ల పాటు ఎగరగలదని నాసా అంచనా వేసింది. అనుకున్నట్టుగానే కాస్త తక్కువగా 161.3 సెకండ్ల పాటు ఎగిరింది. సౌరశక్తితో నడిచే ఇంజిన్యూటీ ఊహించిన దాని కన్నా ఎక్కువ సార్లు ఎగరటమే కాదు, ఇంకా సమర్థంగానే పనిచేస్తోంది. కాబట్టే దీని ప్రయోగ వ్యవధిని రోజురోజుకీ పొడిగిస్తూ వస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని