మన భద్రత సిరాకు అంతర్జాతీయ గుర్తింపు

నకిలీ నోట్లు, నకిలీ స్టాంపు పత్రాల బెడదను నివారించటానికి మన శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక వర్ణద్రవ్యానికి ఇటీవల అమెరికా పేటెంట్‌ దక్కింది. దీంతో దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్టయ్యింది.

Published : 27 Apr 2022 01:55 IST

కిలీ నోట్లు, నకిలీ స్టాంపు పత్రాల బెడదను నివారించటానికి మన శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక వర్ణద్రవ్యానికి ఇటీవల అమెరికా పేటెంట్‌ దక్కింది. దీంతో దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్టయ్యింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబోరేటరీ (ఎన్‌పీఎల్‌) శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం దీన్ని రూపొందించారు. ఫ్లోరోసెన్స్‌-ఫాస్ఫోరెసెన్స్‌ ప్రక్రియ విధానంతో తయారుచేసిన దీన్ని సిరా రూపంలో ముద్రణకు వాడుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే- ఒక తరంగదైర్ఘ్యం సమక్షంలోనే రెండు రంగులను వెదజల్లటం. చుట్టుపక్కల మామూలు కాంతిలో ఇది తెల్లగానే ఉంటుంది. అతినీలలోహిత కాంతి తగిలినప్పుడు  మాత్రం ఫ్లోరోసెన్స్‌ ప్రభావంతో 611 నానోమీటర్ల వద్ద ఎర్రగా, ఫాస్ఫోరెసెన్స్‌ ప్రభావంతో 532 నానోమీటర్ల వద్ద ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఈ రంగులను మామూలు కళ్లతోనే చూడొచ్చు. కరెన్సీ నోట్లు, స్టాంపు పత్రాలు, పాస్‌పోర్టు కవర్ల వంటి వాటి ముద్రణకు దీన్ని వాడుకుంటే నకిలీలను తేలికగా గుర్తించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని