ఉప్పును పెంచే చాప్‌స్టిక్స్‌

వంటకాల్లో ఉప్పు తక్కువగానే ఉంటుంది. తినేటప్పుడు మాత్రం సరిపడా ఉప్పు రుచి తెలుస్తుంది. అదెలా? వంటకాల్లో లేని ఉప్పు తినేటప్పుడు మాత్రం ఎక్కడ్నుంచి వస్తుంది? ఇదేగా మీ సందేహం. అయితే స్మార్ట్‌ చాప్‌స్టిక్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

Updated : 04 May 2022 05:37 IST

వంటకాల్లో ఉప్పు తక్కువగానే ఉంటుంది. తినేటప్పుడు మాత్రం సరిపడా ఉప్పు రుచి తెలుస్తుంది. అదెలా? వంటకాల్లో లేని ఉప్పు తినేటప్పుడు మాత్రం ఎక్కడ్నుంచి వస్తుంది? ఇదేగా మీ సందేహం. అయితే స్మార్ట్‌ చాప్‌స్టిక్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే. జపాన్‌లోని మీజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, కిరిన్‌ హోల్డింగ్స్‌ అనే పానీయాల కంపెనీ సంయుక్తంగా రూపొందించిన ఇవి ఆహారంలో ఉప్పు రుచిని పెంచుతాయి మరి. గడియారం మాదిరిగా చేతికి ధరించే చిన్న కంప్యూటర్‌, విద్యుత్‌ ప్రచోదనాల సాయంతో ఈ చాప్‌స్టిక్స్‌ పనిచేస్తాయి. వీటిని సూప్‌ వంటి వాటిల్లో ముంచినప్పుడు స్వల్ప విద్యుత్‌ ప్రవాహం పుట్టుకొస్తుంది. ఇది ఆహారంలోని సోడియం అయాన్లను పైకి తేలేలా చేసి, వాటిని గ్రహిస్తుంది. తర్వాత చాప్‌స్టిక్స్‌ ద్వారా నోటికి చేరవేస్తుంది. దీంతో ఉప్పు రుచి 1.5 రెట్లు పెరుగుతుంది. అంటే ఉప్పు తక్కువగా ఉన్నా రుచిలో ఎలాంటి తేడా ఉండదన్నమాట. ఉప్పు ఎక్కువగా తింటే అధిక రక్తపోటు, పక్షవాతం, కిడ్నీజబ్బుల వంటివి తలెత్తే ప్రమాదముంది. అందుకే ఉప్పు తగ్గించుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కాకపోతే చప్పిడి కూడు చాలామందికి రుచించదు. అందుకే ఏదో ఒకట్రెండు రోజులు పాటించినా తిరిగి యథావిధిగా ఉప్పు తినేస్తుంటారు. ఇలాంటివారికి ఈ స్మార్ట్‌ ఛాప్‌స్టిక్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. జపాన్‌లో ఉప్పు ఎక్కువగా తింటారు. దీన్ని తగ్గించటానికే శాస్త్రవేత్తల తాజా ప్రయత్నం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని