ఫంక్షన్‌ మీట సహాయం!

కంప్యూటర్‌ కీబోర్డులో కొన్ని మీటలను చాలా తక్కువగా ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు- ఫంక్షన్‌ మీటలు. కీబోర్డు పైభాగాన ఎఫ్‌ 1, ఎఫ్‌2.. ఇలా మొత్తం 12 మీటలు ఉంటాయి. ఇవి షార్ట్‌కట్స్‌గా ఎంతగానో ఉపయోగడతాయి.

Updated : 04 May 2022 05:39 IST

కంప్యూటర్‌ కీబోర్డులో కొన్ని మీటలను చాలా తక్కువగా ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు- ఫంక్షన్‌ మీటలు. కీబోర్డు పైభాగాన ఎఫ్‌ 1, ఎఫ్‌2.. ఇలా మొత్తం 12 మీటలు ఉంటాయి. ఇవి షార్ట్‌కట్స్‌గా ఎంతగానో ఉపయోగడతాయి.

ఎఫ్‌1: వర్డ్‌ ఫైలు వంటి ఏదో ప్రోగ్రామ్‌ మీద పనిచేస్తున్నారు. అప్పుడు ఏదైనా సహాయం కావాలంటే ఎఫ్‌1 మీట నొక్కితే చాలు. స్క్రీన్‌ మీద ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ‘హెల్ప్‌’ విండో తెరచుకుంటుంది.

ఎఫ్‌2: ఏదైనా ఫైలు, ఫోల్డర్‌ పేరును మార్చటానికి డబుల్‌ క్లిక్‌ చేయటం తెలిసిందే. ఈసారి ఫైలు లేదా ఫోల్డర్‌ను ఎంచుకొని ఎఫ్‌2 బటన్‌ నొక్కి చూడండి. వెంటనే పేరు సెలెక్ట్‌ అవుతుంది. తర్వాత దాన్ని మార్చుకుంటే సరి.

ఎఫ్‌3: వెబ్‌సైట్‌లో ఏదైనా పదాన్ని వెతకాలంటే ఏం చేస్తారు? కంట్రోల్‌ బటన్‌తో పాటు ఎఫ్‌ మీటనూ నొక్కుతారు కదా. ఇలా రెండు మీటలు నొక్కాల్సిన పనిలేకుండా తేలికగా ఎఫ్‌3 నొక్కితే చాలు. ఫైండ్‌ బాక్స్‌ కనిపిస్తుంది. దీంతో సమయం, శ్రమ తగ్గుతాయి.

ఎఫ్‌4: ఓపెన్‌ చేసి ఉన్న విండోను క్లోజ్‌ చేయాలనుకుంటే ఆల్ట్‌, ఎఫ్‌4 కలిపి నొక్కితే చాలు.

ఎఫ్‌5: పేజీని గానీ డాక్యుమెంట్‌ విండోను గానీ రిఫ్రెష్‌ లేదా రీలోడ్‌ చేయటానికిది ఉపయోగపడుతుంది.

ఎఫ్‌6: ఇంటర్నెట్‌ బ్రౌజర్లలో అడ్రస్‌ బార్‌కు కర్సర్‌ను మూవ్‌ చేయాలంటే ఎఫ్‌6ను నొక్కితే సరి.

ఎఫ్‌7: మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ డాక్యుమెంట్‌లో స్పెల్లింగ్‌, గ్రామర్‌ చెక్‌ చేయాలనుకుంటే ఎఫ్‌7 బటన్‌తో తేలికగా సరిచూసుకోవచ్చు.

ఎఫ్‌8: కంప్యూటర్‌ను ఆన్‌ చేసినప్పుడు బూట్‌ మెనూలోకి వెళ్లటానికి ఎఫ్‌8 బాగా ఉపయోగపడుతుంది.

ఎఫ్‌9: మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ డాక్యుమెంటును రిఫ్రెష్‌ చేయాలనుకున్నా, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌లో ఈమెయిల్‌ను పంపించుకోవాలన్నా ఎఫ్‌9ను ప్రయత్నించి చూడొచ్చు.

ఎఫ్‌10: ఇది ఓపెన్‌ చేసి ఉన్న అప్లికేషన్‌ మెనూ బార్‌ను యాక్టివేట్‌ చేస్తుంది. షిఫ్ట్‌, ఎఫ్‌10 బటన్లు రెండింటినీ కలిపి నొక్కితే రైట్‌ క్లిక్‌ మాదిరిగానూ ఉపయోగపడుతుంది.

ఎఫ్‌11: అప్లికేషన్లను ఎప్పుడైనా ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌లో పెట్టుకోవటానికి, దీనిలోంచి బయటకు రావటానికి ఎఫ్‌11 తోడ్పడుతుంది.

ఎఫ్‌12: ఇది మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో సేవ్‌ యాజ్‌ డైలాగ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి పెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని