స్పర్శజ్ఞానంలో కొత్తకోణం
మన చర్మ స్పర్శజ్ఞానం అద్భుతమైంది. ఇది ఉపరితలాల రసాయన మిశ్రమాల్లో స్వల్ప మార్పులనూ గుర్తించగలదని యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్ (యూడీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. స్పర్శ జ్ఞానంతో ముడిపడిన పరికరాల రూపకల్పనలో ఇది కొత్త మార్పులకు
మన చర్మ స్పర్శజ్ఞానం అద్భుతమైంది. ఇది ఉపరితలాల రసాయన మిశ్రమాల్లో స్వల్ప మార్పులనూ గుర్తించగలదని యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్ (యూడీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. స్పర్శ జ్ఞానంతో ముడిపడిన పరికరాల రూపకల్పనలో ఇది కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలదని, వర్చువల్ రియాలిటీ పరిజ్ఞానాలకు ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు.
మనిషి ఇంద్రియ జ్ఞానాలతో కూడిన వ్యవస్థల రూపకల్పనలో ఇటీవల చాలా ఆసక్తి పెరిగింది. స్మార్ట్‌ఫోన్ తెరలు, కంప్యూటర్ మానిటర్లు, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్స్, ఆడియో పరికరాల్లో చూపు, శబ్ద జ్ఞానాలను ఇప్పటికే వాడుకుంటున్నారు. అయితే నొప్పి, వేడి, పరిసరాల అవగాహనతో ముడిపడిన తాకిన (టాక్టయిల్) అనుభూతి కలిగించటమనేది అంత తేలికైన పనికాదు. ఇదో సంక్లిష్టమైన వ్యవస్థ. అందుకే టెక్నాలజీ అవసరాలకు దీన్ని వాడుకోవటంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయాం. ఈ అడ్డంకిని అధిగమించటానికి యూడీ శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. వేలితో తాకటం ద్వారా ఆయా ఉపరితలాలపై స్వల్ప రసాయన మార్పులనూ మనం గుర్తించగలమని నిరూపించారు. ఉదాహరణకు నత్రజని అణువు ఉండాల్సిన చోట కర్బన అణువు ఉన్నా పసిగట్టగలమని రుజువు చేశారు. దేనినైనా తాకితే దాని ఉపరితం మన వేలికి తగులుతుంది. వేలు, ఉపరితలం మధ్య పుట్టుకొచ్చే ఘర్షణలో మార్పులను బట్టి మన అనుభూతి మారుతుంది. ఇక్కడే రసాయన శాస్త్రం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మరింత సున్నితమైన ఇంద్రియ జ్ఞానాలను పుట్టించటానికి ఆయా పదార్థాల రసాయన స్వభావాలు కొత్త దారులను తెరవగలవని పరిశోధకులు భావిస్తున్నారు. వర్చువల్ రియాలిటీ పరికరాల నుంచి సమాచారాన్ని అందించే పదార్థాన్ని రూపొందించటానికి తోడ్పడగలవని ఆశిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్పర్శ జ్ఞానాన్ని కలిగించటానికి తోడ్పడే హ్యాప్టిక్ టెక్నాలజీ వేగంగా పురోగమిస్తోంది. మొబైల్ ఫోన్లు, గేమ్ కంట్రోళ్లలో వైబ్రేషన్ వంటివి హ్యాప్టిక్ టెక్నాలజీకి ఉదాహరణలే. శరీరానికి ధరించే కొన్ని పరికరాలు ఇందుకోసం సేంద్రియ పదార్థాలను వినియోగించుకుంటాయి. సిలికాన్‌తో కూడిన సిలేన్ పొరల మందాల వ్యత్యాసాలను వేలితో తాకటం ద్వారా మనం గుర్తించగలమని యూడీ శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. రసాయన మార్పుల కారణంగా పుట్టుకొచ్చే ఘర్షణలో తేడాల మూలంగానే ఇది సాధ్యమవుతుందని తేల్చారు. ఇలాగే పాలిమర్ పొరల తేడాలనూ వేలితో తాకటం ద్వారా గుర్తించగలమని తాజాగా నిరూపించారు. పాలిమర్ అణువుల స్ఫటికీకరణలో స్వల్ప మార్పులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి మూలంగానే వేలితో తాకినప్పుడు ఘర్షణలో తేడాలు పుట్టుకొస్తున్నాయి. ఇవే స్వల్ప మార్పులను సైతం గుర్తించటానికి వీలు కల్పిస్తున్నాయి. భౌతికంగా తాకటానికి బదులు రసాయన గుణాలతోనే స్పర్శ అనుభూతిని కలిగించే కొత్త పరికరాల రూపకల్పనకు ఇది దారితీయగలదని భావిస్తున్నారు. దీని ద్వారా మెటావర్స్ లాంటి కాల్పనిక వాస్తవ ప్రపంచంలో ప్రత్యక్షంగా తాకిన అనుభూతి కలగొచ్చు. మున్ముందు ఇది వర్చువల్ రియాలిటీని ప్రత్యక్ష ప్రపంచంగా మార్చగలదన్నా అతిశయోక్తి కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు.
తాజా వార్తలు (Latest News)
-
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం