కాళ్లు లేకున్నా కుట్టొచ్చు!

మన దేశంలో కాళ్లు, పాదాలు సరిగా లేనివారు సుమారు 2 కోట్ల మంది ఉన్నారని అంచనా. కుట్టు మిషిన్‌ గురించి కొత్తగా చెపాల్సిన అవసరం లేదు. కాళ్లతో తొక్కుతూ ఎంచక్కా కుట్టేస్తుంటారు. విద్యుత్తు

Updated : 18 May 2022 06:44 IST

మన దేశంలో కాళ్లు, పాదాలు సరిగా లేనివారు సుమారు 2 కోట్ల మంది ఉన్నారని అంచనా. 

కుట్టు మిషిన్‌ గురించి కొత్తగా చెపాల్సిన అవసరం లేదు. కాళ్లతో తొక్కుతూ ఎంచక్కా కుట్టేస్తుంటారు. విద్యుత్తు మోటారుతో పనిచేసే కుట్టు మిషిన్లూ ఉన్నాయి. పాదంతో పెడల్‌ను తొక్కగానే మిషిన్‌ కుట్టటం ఆరంభిస్తుంది. అయితే కాళ్లు లేనివారికి, పాదంతో పెడల్‌ను తొక్కలేనివారికి మాత్రం ఇది కష్టమైన పనే. మరెలా? సేలమ్‌లోని సోనా కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు రూపొందించిన కుట్టు యంత్రం తెచ్చుకుంటే సరి. ఇందులో పాదంతో తొక్కే పెడల్‌ ఉండదు. కుట్టు మిషిన్‌ బల్ల మీద ఎల్‌ ఆకారంలో ఒక పళ్లెం ఉంటుంది. దీన్ని నెమ్మదిగా చేత్తో నెడితే మిషిన్‌ పనిచేయటం మొదలెడుతుంది. ఎంత గట్టిగా నొక్కితే అంత వేగంగా మిషిన్‌ కుడుతుంది. బరువు తూచే యంత్రంలోని లోడ్‌ కణం సూత్రం మీద ఇది పని చేస్తుంది. దీని మీద పడిన ఒత్తిడి వోల్టేజ్‌గా మారుతుంది. వెంటనే మోటారు పని మొదలెడుతుంది. దీనికి ఇటీవల పేటెంట్‌ కూడా లభించింది. దీన్ని వస్త్ర పరిశ్రమల్లో పెద్దఎత్తున వాడుకుంటే ఎంతోమంది వికలాంగులకు ఉపాధి లభిస్తుంది. మన దేశంలో కాళ్లు లేనివారు, పాదాలు సరిగా పనిచేయనివారు సుమారు 2 కోట్ల మంది ఉన్నారని అంచనా. ఇలాంటివారందరికీ ఇది ఉపయోగపడుతుంది. దీన్ని నేర్చుకోవటానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. తేలికగానే అలవడుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని