ప్రపంచంలోనే అతి పెద్ద మొక్క!

ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కను పరిశోధకులు గుర్తించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రపంచ వారసత్వ ప్రాంతం షార్క్‌ బే జలాల్లో దీన్ని కనుగొన్నారు. ఇదో మొండి సముద్ర గడ్డి. పేరు పోసిడోనియా ఆస్ట్రాలిస్‌. అతి ప్రాచీనమైన ఇది 180 కిలోమీటర్ల...

Published : 22 Jun 2022 00:15 IST

ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కను పరిశోధకులు గుర్తించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రపంచ వారసత్వ ప్రాంతం షార్క్‌ బే జలాల్లో దీన్ని కనుగొన్నారు. ఇదో మొండి సముద్ర గడ్డి. పేరు పోసిడోనియా ఆస్ట్రాలిస్‌. అతి ప్రాచీనమైన ఇది 180 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉండటం గమనార్హం. దీని వయసు కనీసం 4,500 సంవత్సరాలని పరిశోధకుల అంచనా. యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియా, ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు షార్క్‌ బేలోని సముద్ర గడ్డి నమూనాలను   సేకరించి, జన్యు విశ్లేషణ చేశారు. ఇవన్నీ వేర్వేరు మొక్కలనే భావించారు. కానీ 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొక్కలూ ఇవీ ఒకటేనని తేలటంతో ఆశ్చర్యపోయారు. అంటే ఒక్క మొక్కే ఇంత దూరం విస్తరించి ఉందన్నమాట. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కగా భావిస్తున్నారు. సముద్రంలో దీని జాతికి చెందిన మొక్కతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ క్రోమోజోములనూ కలిగి ఉంది (పాలీప్లాయిడ్‌). పువ్వులు పూయకపోయినా, విత్తనాలు ఏర్పడకపోయినా ఈ మొక్క ఇంతకాలం జీవించి ఉండటం, ఇంత దూరం విస్తరించటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని