Toll charges: గూగుల్‌ మ్యాప్స్‌లో టోల్‌ ఛార్జీల వివరాలు

కారులో దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటాం. మధ్యలో ఎన్నెన్నో టోల్‌గేట్లు దాటాల్సి రావొచ్చు. ఎంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందో తెలిస్తే? ముందుగానే సిద్ధం కావొచ్చు కదా. గూగుల్‌ మ్యాప్స్‌ ఈ సదుపాయాన్నే తీసుకొచ్చింది. మనదేశంతో పాటు

Updated : 22 Jun 2022 09:12 IST

కారులో దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటాం. మధ్యలో ఎన్నెన్నో టోల్‌గేట్లు దాటాల్సి రావొచ్చు. ఎంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందో తెలిస్తే? ముందుగానే సిద్ధం కావొచ్చు కదా. గూగుల్‌ మ్యాప్స్‌ ఈ సదుపాయాన్నే తీసుకొచ్చింది. మనదేశంతో పాటు అమెరికా, జపాన్‌, ఇండోనేసియా దేశాల్లోని సుమారు 2వేల టోల్‌ రోడ్ల ఛార్జీల వివరాలు చూపించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఎక్కడెక్కడ ఎంత రుసుము వసూలు చేస్తున్నారు, మొత్తం ప్రయాణంలో ఎంత దీనికి కేటాయించాల్సి ఉంటుందో తెలుసు కోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతికేవారి కోసం టోల్‌ గేట్లు లేని రోడ్లను చూపించే ఫీచర్‌ కూడా ఉంది. పైన కుడి మూలన మూడు చుక్కల మీద ట్యాప్‌ చేసి రోడ్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. టోల్‌ రోడ్లలో అసలే ప్రయాణించొద్దనుకుంటే ‘అవాయిడ్‌ టోల్స్‌’ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని