వాట్సప్‌లో ‘డు నాట్‌ డిస్టర్బ్‌’

నిర్ణీత కాలం తర్వాత కనుమరుగయ్యే సందేశాలు. వివిధ పరికరాలను సపోర్టు చేయటం. ఇటీవల ఇలాంటి అదనపు సదుపాయాలతో ఆకట్టుకున్న వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. తాజా బీటా అప్‌డేట్‌లో భాగంగా ‘డు నాట్‌ డిస్టర్బ్‌’ అవకాశాన్ని....

Published : 22 Jun 2022 00:24 IST

నిర్ణీత కాలం తర్వాత కనుమరుగయ్యే సందేశాలు. వివిధ పరికరాలను సపోర్టు చేయటం. ఇటీవల ఇలాంటి అదనపు సదుపాయాలతో ఆకట్టుకున్న వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. తాజా బీటా అప్‌డేట్‌లో భాగంగా ‘డు నాట్‌ డిస్టర్బ్‌’ అవకాశాన్ని కల్పించనుంది. ఇది ఇన్‌కమింగ్‌ కాల్స్‌, మెసేజ్‌ నోటిఫికేషన్లను బ్లాక్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తుందని వాట్సప్‌ కొత్త ఫీచర్లను ట్రాక్‌ చేసే వాబీటాఇన్ఫో పేర్కొంటోంది. సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు, పడుకున్నప్పుడు మధ్యలో భంగం కలిగించకుండా చూడటానికిది తోడ్పడుతుంది. దీన్ని సెటింగ్స్‌ ద్వారా ఎనేబుల్‌, డిసేబుల్‌ చేసుకోవచ్చు. టైమ్‌ను సెట్‌ చేసుకునే సదుపాయమూ ఉంటుంది. దీంతో అంతవరకే ఫీచర్‌ ఎనేబుల్‌ అవుతుంది. అయితే ప్రస్తుతానికిది ఐఓఎస్‌ 15 సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఐఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అడ్మిన్‌కు గానీ ఇతర సభ్యులకు గానీ తెలియకుండా గ్రూప్‌ నుంచి వెళ్లిపోయే ఆప్షన్‌ తేవాలనీ వాట్సప్‌ ప్రయత్నిస్తోంది.  మరో సరికొత్త భద్రతా ఫీచర్‌నూ పరీక్షిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని