అలెక్సా..మరణించిన బంధువుల గొంతునూ అనుకరిస్తుంది!

‘అలెక్సా! నాకోసం మా తాతగారితో రామాయణం కథ వినిపించు’ అని ఆదేశించారనుకోండి. వెంటనే తాతగారి గొంతుతో కథ వినిపిస్తే? అదీ ఆయన ఆరు నెలల క్రితమే చనిపోయి ఉంటే? విచిత్రమే కదా.

Updated : 29 Jun 2022 12:10 IST

‘అలెక్సా! నాకోసం మా తాతగారితో రామాయణం కథ వినిపించు’ అని ఆదేశించారనుకోండి. వెంటనే తాతగారి గొంతుతో కథ వినిపిస్తే? అదీ ఆయన ఆరు నెలల క్రితమే చనిపోయి ఉంటే? విచిత్రమే కదా. అలెక్సా కోసం అమెజాన్‌ ఇలాంటి వినూత్న ఫీచర్‌నే రూపొందిస్తోంది. ఇది చిన్న ఆడియో క్లిప్స్‌ నుంచి వ్యక్తుల మాటలను గ్రహించి వారి గొంతును అనుకరిస్తుంది మరి. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మాటలను మార్చేలా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. నిజానికి కృత్రిమ మేధతో గొంతులను అనుకరించటం కొత్తేమీ కాదు. పోడ్‌క్యాస్టింగ్‌, సినిమాలు, టీవీలు, వీడియో గేమ్స్‌ వంటి పరిశ్రమల్లో ‘ఆడియో డీప్‌ఫేక్స్‌’ పరిజ్ఞానాన్ని ఇప్పటికే వాడుకుంటున్నారు. ఒక డాక్యుమెంటరీ చిత్రంలో నటుడు మాట్లాడని మాటలనూ ఏఐ సాయంతో వినిపించేలా చేశారు. చనిపోయిన వ్యక్తి గొంతుతో మాట్లాడేలా ఒక ఛాట్‌బోట్‌కు శిక్షణ ఇచ్చారు కూడా. ఇప్పుడు ఈ పరిజ్ఞానాన్ని మరింత వినోద భరితంగా మార్చాలని అమెజాన్‌ ప్రయత్నిస్తోంది. మనకు ఇష్టమైనవారి వ్యక్తుల గొంతులో మాటలను వినిపించే ఈ ఫీచర్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారన్నది ప్రకటించలేదు. కానీ త్వరలోనే అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని