విండోస్‌ 8.1కు వీడ్కోలు!

విండోస్‌ 8.1 వాడుతున్నారా? అయితే వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. ఆరేళ్ల కిందటే విండోస్‌ 8కు సపోర్టు నిలిపేసిన మైక్రోసాఫ్ట్‌ సంస్థ వచ్చే జనవరి నుంచి విండోస్‌ 8.1కు సపోర్టు చేయటం ఆపేయనుంది మరి.

Updated : 29 Jun 2022 03:28 IST

విండోస్‌ 8.1 వాడుతున్నారా? అయితే వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. ఆరేళ్ల కిందటే విండోస్‌ 8కు సపోర్టు నిలిపేసిన మైక్రోసాఫ్ట్‌ సంస్థ వచ్చే జనవరి నుంచి విండోస్‌ 8.1కు సపోర్టు చేయటం ఆపేయనుంది మరి. ఆ తర్వాత ఇది మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌ను సపోర్టు చేయదు. వీటికి సంబంధించిన ఫీచర్‌, సెక్యూరిటీ, ఇతర క్వాలిటీ అప్‌డేట్స్‌ అందవు. విండోస్‌ 8, విండోస్‌ 8.1 పరికరాలకు విండోస్‌ 11ను అప్‌గ్రేడ్‌ చేసుకునే సదుపాయాలు లేవు. అందువల్ల విండోస్‌ 10కు మారటమే మార్గం. దీనికీ అక్టోబర్‌ 14, 2025 తర్వాత సపోర్టు ఆగిపోనుంది. అందుకే తాజా సామర్థ్యాల ప్రయోజనం పొందటానికి విండోస్‌ 11తో కూడిన కొత్త పీసీకి మారటం మంచిదని మైక్రోసాఫ్ట్‌ ముందుగానే సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని