Updated : 07 Jul 2021 05:22 IST

షామీ టీవీ వెబ్‌క్యామ్‌

స్మార్ట్‌టీవీ, కంప్యూటర్ల కోసం షామీ తాజాగా టీవీ వెబ్‌క్యామ్‌ను విడుదల చేసింది. చవకైన, నాణ్యమైన వెబ్‌క్యామ్‌ కావాలనుకునేవారికిది మంచి ఎంపిక. మెటల్‌ ఫ్రేమ్‌తో కూడిన ఇది ఫుల్‌ హెచ్‌డీ (1080పి), 25 ఎఫ్‌పీఎస్‌ ఫ్రేమ్‌ రేట్‌, 71 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతో మరింత స్పష్టమైన దృశ్యాలకు వీలు కల్పిస్తుందని కంపెనీ చెబుతోంది. దీన్ని అమర్చుకోవటం చాలా తేలిక. యూఎస్‌బీ టైప్‌ సి పోర్టుతో కూడిన 1.5 మీటర్ల కేబుల్‌తో టీవీ, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌.. ఇలా వేటికైనా అనుసంధానం చేసుకోవచ్చు. ఎత్తును సవరించుకోవటానికి వీలైన అయస్కాంత బేస్‌ ఉండటం వల్ల ఏ పరికరానికైనా వెనకవైపు తేలికగా అటాచ్‌ చేసుకొని వాడుకోవచ్చు. స్మార్ట్‌ టీవీతో గూగుల్‌ డుయో వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. అన్ని మి టీవీలు, రెడ్‌మి టీవీలు, ఆండ్రాయిడ్‌ టీవీలు, విండోస్‌ ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లకు అనువుగా ఉంటుంది. భద్రత కోసం వెబ్‌క్యామ్‌కు షటర్‌ కూడా ఉంటుంది. దీంతో అవసరమైనప్పుడే కెమెరాను ఆన్‌ చేసుకోవచ్చు. లెన్స్‌కు రెండు వైపులా మైక్రోఫోన్‌ ఉండటం వల్ల 4 మీటర్ల దూరంలోని శబ్దాలనూ గ్రహిస్తుంది. 2ఎంపీ రెజల్యూషన్‌, ఫిక్స్‌డ్‌ ఫోకస్‌, 3డీ ఇమేజ్‌ నాయిస్‌ రిడక్షన్‌ వంటి ఫీచర్స్‌ అదనం. బరువు 45.6 గ్రాములు. ధర రూ.2వేల లోపే.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని