Published : 19 Jan 2022 01:04 IST

ట్యాబ్‌లు క్రమశిక్షణగా..

అంతర్జాల విహారం చేస్తున్నప్పుడు ఒకేసారి రెండు మూడు పేజీలను ఓపెన్‌ చేసి, చూడటం మామూలే. ఇలా వివిధ ట్యాబ్‌లను తెరచి ఉంచుకోవటం చాలా మేలు చేస్తుంది. రిఫరెన్స్‌ పేజీలను చూసుకోవటం, పెద్ద కథనాలను ఎప్పుడైనా చదువుకునేలా సేవ్‌ చేసుకోవటం, ఈమెయిళ్లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవటం వంటివాటికిది ఉపయోగపడుతుంది. అయితే ట్యాబ్‌ల సంఖ్య మరీ ఎక్కువైతే? వీటిని వెతుక్కోవటానికే సమయమంతా పడుతుంది. ఇది ఏకాగ్రతను దెబ్బతీయటమే కాదు.. కంప్యూటర్‌ మెమరీని కూడా తింటుంది. దీంతో పీసీ వేగం నెమ్మదిస్తుంది. మరెలా అని బెంగపడకండి. ఎక్కువెక్కువ ట్యాబ్స్‌ ఓపెన్‌ చేసేవారికి సాయం చేసే ఎక్స్‌టెన్షన్లు లేకపోలేదు. వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే పేజీలను సేవ్‌ చేసుకోవటం, వేరే పనుల్లో ఉన్నప్పుడు ఆయా విండోలను మ్యూట్‌ చేయటం వంటివాటికి తోడ్పడతాయి.

వన్‌ట్యాబ్‌
ట్యాబ్‌ మేనేజ్‌మెంట్‌కు ఇది తేలికైన మార్గం. ఎక్స్‌టెన్షన్‌ గుర్తు మీద నొక్కితే అన్ని ట్యాబ్స్‌ వాటంతటవే అదృశ్యమవుతాయి. అయితే ఇవన్నీ వన్‌ట్యాబ్‌ ఇంటర్ఫేస్‌ మీద అలాగే ఉంటాయి. దీన్ని ఒకరకంగా విడి బ్రౌజర్‌ విండో అనీ అనుకోవచ్చు. ఆయా ట్యాబ్‌లను గ్రూప్‌లుగానూ విభజించుకోవచ్చు. వీటికి ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. ఇలా వేర్వేరుగానే కాదు.. గ్రూప్‌గానూ పేజీలను ఒకేసారి తెరచి చూసుకోవచ్చు.

ఎక్స్‌ట్యాబ్‌
తెరచి ఉండే ట్యాబ్‌ సంఖ్యను నియంత్రించుకోవటానికిది చక్కని మార్గం, ఇందులో ఒకసారి ట్యాబ్‌ సంఖ్యను నిర్ణయించుకుంటే చాలు. అంతవరకే తెరచి ఉంచుతుంది. ఉదాహరణకు 12 ట్యాబ్స్‌ను ఎంచుకున్నారనుకోండి. 13వ ట్యాబ్‌ను ఓపెన్‌ చేస్తే పాత ట్యాబ్‌ క్లోజ్‌ అవుతుంది. ఏ ట్యాబ్‌ క్లోజ్‌ కావాలనేదీ ముందే నిర్ణయించుకోవచ్చు. అంటే.. ఇటీవల వాడినది, పెద్దగా చూడనిది, అన్నింటికన్నా పాతది ఇలా రకరకాలుగా ట్యాబ్స్‌ క్లోజయ్యేలా చూసుకోవచ్చు. దీంతో కొత్త ట్యాబ్‌ను తెరవటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుందన్నమాట.

ట్రీ ట్యాబ్స్‌
ట్యాబ్స్‌ అడవిలో దారితప్పకుండా ఉండటానికిది తోడ్పడుతుంది. దీని ద్వారా ట్యాబ్స్‌ను ఒక పక్కన చెట్టు మాదిరిగా నిలువుగా పేర్చుకోవచ్చు. క్రీడలు, బ్యాంకులు, సామాజిక మాధ్యమాలు.. ఇలా వివిధ విభాగాలుగా వర్గీకరించుకోవచ్చు. ట్యాబ్స్‌ మరీ ఎక్కువ సంఖ్యలో ఉంటే ట్రీ ట్యాబ్స్‌ సైడ్‌బార్‌లో సెర్చ్‌ చేసుకోవచ్చు. తర్వాత బ్రౌజింగ్‌ చేసుకోవటానికి పేజీలను సేవ్‌ చేసుకోవచ్చు. అప్పుడే క్లోజ్‌ చేసిన విండో తిరిగి ఓపెన్‌ అయ్యేలా కూడా నిర్ణయించుకోవచ్చు.

మ్యూట్‌ ఆల్‌ ఇనాక్టివ్‌ ట్యాబ్స్‌
ట్యాబ్స్‌ చిందర వందరగా లేకుండానే కాదు, అసౌర్యం కలిగించకుండా చూసుకోవటమూ ముఖ్యమే. చాలా విండోస్‌ ఓపెన్‌ చేసినప్పుడు దేనిలోనైనా వీడియో గానీ ఆడియో క్లిప్‌ గానీ ప్లే అవుతుంటే అది వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడే మ్యూట్‌ ఆల్‌ ఇనాక్టివ్‌ ట్యాబ్స్‌ ఉపయోగపడుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది చూస్తున్న ట్యాబ్‌ను తప్ప మిగతా అన్నింటినీ మ్యూట్‌లో పెట్టేస్తుంది. ఒకవేళ నిజంగానే ఇనాక్టివ్‌ ట్యాబ్‌లో ప్లే అవుతున్న వీడియో, ఆడియోను వినాలనుకుంటే ట్యాబ్‌ హెడర్‌ మీద క్లిక్‌ చేసి, అన్‌మ్యూట్‌ చేసుకోవచ్చు. వేరే ట్యాబ్‌లోకి వెళ్లినా వెనకాల అవి ప్లే అవుతూనే ఉంటాయి.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని