ఐఫోన్‌లో సిరితోనే వాట్సప్‌ మెసేజ్‌లు

ఐఫోన్‌లో వాట్సప్‌ వాడుతున్నారా? మెసేజ్‌లను ఎలా పంపిస్తున్నారు? టైప్‌ చేసి పంపిస్తున్నారా? అయితే సిరి గురించి తెలియదన్నట్టే. సిరి ద్వారా మాటలతోనే మెసేజ్‌లను టైప్‌ చేసుకొని, పంపించుకోవచ్చు మరి. అంతేకాదు.. దీంతో వాట్సప్‌ కాల్స్‌

Published : 02 Feb 2022 01:10 IST

ఫోన్‌లో వాట్సప్‌ వాడుతున్నారా? మెసేజ్‌లను ఎలా పంపిస్తున్నారు? టైప్‌ చేసి పంపిస్తున్నారా? అయితే సిరి గురించి తెలియదన్నట్టే. సిరి ద్వారా మాటలతోనే మెసేజ్‌లను టైప్‌ చేసుకొని, పంపించుకోవచ్చు మరి. అంతేకాదు.. దీంతో వాట్సప్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌లను వినొచ్చు. కాకపోతే ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ 10.3, ఆ తర్వాతి ఐఫోన్లలోనే అందుబాటులో ఉంటుంది. మెసేజ్‌లను సిరి చదివి వినిపించటానికి నోటిఫికేషన్‌ బ్యాడ్జ్‌ను రీసెట్‌ చేసుకోవాలి. వాట్సప్‌లో సిరి ద్వారా మెసేజ్‌లను పంపటాన్ని, కాల్స్‌ చేసుకోవటాన్ని ఎనేబుల్‌ చేసుకునే మార్గం ఇదీ..

ఐఫోన్‌లో వాట్సప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఐఫోన్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘సిరి అండ్‌ సెర్చ్‌’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసి, ఆన్‌ చేసుకోవాలి. కిందికి స్క్రోల్‌ చేసి, వాట్సప్‌ మీద ట్యాప్‌ చేయాలి. ‘యూజ్‌ విత్‌ సిరి’ ఆప్షన్‌ను ఆన్‌ చేయాలి.

ఐఫోన్‌ ఎక్స్‌, ఎక్స్‌ఎస్‌, ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఎక్స్‌ఆర్‌ ఫోన్లలో సైడ్‌ బటన్‌ను కాసేపు అలాగే నొక్కి పట్టుకొని సిరిని ఆన్‌ చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని