Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్‌ వాచ్‌

అతను ఎలక్ట్రిక్‌ బైక్‌ మీద వెళ్తున్నాడు. హఠాత్తుగా ప్రమాదం జరిగింది. కింద పడిపోయాడు. గాయాలయ్యాయి. రక్తస్రావం జరుగుతోంది. పక్కన ఎవరూ లేరు. అయినా పోలీసులు అక్కడికి పరుగెత్తుకు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు నిలిచాయి.

Updated : 13 Aug 2022 12:22 IST

తను ఎలక్ట్రిక్‌ బైక్‌ మీద వెళ్తున్నాడు. హఠాత్తుగా ప్రమాదం జరిగింది. కింద పడిపోయాడు. గాయాలయ్యాయి. రక్తస్రావం జరుగుతోంది. పక్కన ఎవరూ లేరు. అయినా పోలీసులు అక్కడికి పరుగెత్తుకు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు నిలిచాయి. ఇదెలా సాధ్యమైందో తెలుసా? యాపిల్‌ వాచ్‌ మూలంగా! ఆ వ్యక్తి పడిపోతున్న విషయాన్ని అతడి చేతికున్న యాపిల్‌ వాచ్‌ గుర్తించి, అత్యవసర నంబరుకు దానంతటదే ఫోన్‌ చేసింది మరి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన సంఘటన ఇది. ఫోన్‌ కాల్‌ను గుర్తించిన పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి, వ్యక్తి ప్రాణాలను కాపాడారు. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ లేదా యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 4, దీని తర్వాతి మోడల్‌ గడియారాల్లో కింద పడిపోతున్నవారిని గుర్తించే ఫీచర్‌ ఉంది. ఇది ఎవరైనా పడిపోతుంటే గుర్తిస్తుంది. నిమిషం దాటినా వ్యక్తి కదలకపోతే దానంతటదే అత్యవసర నంబరుకు ఫోన్‌ చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని