ఫోన్‌ పగిలినా పర్వాలేదు!

ఖరీదైన మొబైల్‌ ఫోన్‌. ముచ్చటపడి కొన్నాం. పొరపాటున కింద పడింది. పగిలిపోయింది. ఏం చేస్తాం? రిపేర్‌ చేయిస్తాం. లేదూ కొత్తది కొంటాం. కానీ మున్ముందు ఇలాంటి అవసరం ఉండకపోవచ్చు. మొబైల్‌ ఫోన్‌ దానంతటదే మరమ్మతు కావొచ్చు....

Published : 20 Apr 2022 02:02 IST

రీదైన మొబైల్‌ ఫోన్‌. ముచ్చటపడి కొన్నాం. పొరపాటున కింద పడింది. పగిలిపోయింది. ఏం చేస్తాం? రిపేర్‌ చేయిస్తాం. లేదూ కొత్తది కొంటాం. కానీ మున్ముందు ఇలాంటి అవసరం ఉండకపోవచ్చు. మొబైల్‌ ఫోన్‌ దానంతటదే మరమ్మతు కావొచ్చు. బయటి నుంచి మనమేమీ చేయకుండానే పగుళ్లు పూడుకుపోయి యథాస్థితికి రావొచ్చు. అదెలా? పీజోఎలక్ట్రిక్‌ స్ఫటికాల మాయతో! కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకులు ఐఐటీ ఖరగ్‌పుర్‌ సాయంతో కొత్తరకం పీజోఎలక్ట్రిక్‌ స్ఫటికాలను రూపొందించారు. బైపైరోజోల్‌ సేంద్రియ స్ఫటికాలుగా పిలుచుకునే వీటికి తమకు తామే మరమ్మతయ్యే గుణముంటుంది మరి. కింద పడటం వంటి యాంత్రిక ప్రభావాలకు లోనైనప్పుడివి విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి. అప్పుడు పగిలిపోయిన ముక్కలు కలుసుకునే చోట విద్యుదావేశం పుట్టుకొస్తుంది. దీంతో పగుళ్లు ఆకర్షితమై తిరిగి అతుక్కుపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని