వీడియోలకు సబ్‌టైటిల్స్‌ జోడిస్తారా?

ఏదో వీడియో తీస్తాం. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. ఎక్కువ మంది చూడాలని భావిస్తాం. మన భాష తెలియనివారికి అది అర్థం కావటం కష్టం. కంటెంట్‌ బాగున్నా అంతగా రుచించదు. ఇక్కడే సబ్‌టైటిల్స్‌ బాగా ఉపయోగపడతాయి. వీడియోలు ఎక్కువ మందికి, రకరకాల భాషలు మాట్లాడేవారికి చేరుకోవటానికి తోడ్పడతాయి. వినికిడి లోపం గలవారికీ వీడియోలు అర్థమవుతాయి.

Published : 18 May 2022 00:50 IST

ఏదో వీడియో తీస్తాం. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. ఎక్కువ మంది చూడాలని భావిస్తాం. మన భాష తెలియనివారికి అది అర్థం కావటం కష్టం. కంటెంట్‌ బాగున్నా అంతగా రుచించదు. ఇక్కడే సబ్‌టైటిల్స్‌ బాగా ఉపయోగపడతాయి. వీడియోలు ఎక్కువ మందికి, రకరకాల భాషలు మాట్లాడేవారికి చేరుకోవటానికి తోడ్పడతాయి. వినికిడి లోపం గలవారికీ వీడియోలు అర్థమవుతాయి. మ్యూట్‌లో పెట్టుకొని చూసినా విషయమంతా తెలిసిపోతుంది. కానీ వీడియోకు సబ్‌టైటిల్స్‌ను జోడించటం అంత తేలికైన పనికాదు. చాలా సమయం పడుతుంది. వీడియోలు సృష్టించేవారికి, ఎడిటర్లకు ఇది అనుభవైక వేద్యమే. అయితే యూట్యూబ్‌ వీడియోలకు తేలికగా సబ్‌టైటిల్‌్్సను జోడించుకోవటానికి మార్గం లేకపోలేదు. 

మొబైల్‌లో యూట్యూబ్‌ స్టుడియో యాప్‌తో వీడియోలకు సబ్‌ టైటిల్స్‌ను జత చేసుకునే అవకాశం లేదు. కాబట్టి డెస్క్‌టాప్‌ మీదే చేసుకోవాలి. 

ముందుగా యూట్యూబ్‌ స్టుడియోను ఓపెన్‌ చేయాలి. తమ ఛానెల్‌లో లాగిన్‌ కావాలి. అప్‌లోడ్‌ వీడియోస్‌ గుర్తును క్లిక్‌ చేసి, వీడియోను అప్‌లోడ్‌ చేయటం మొదలెట్టాలి. వీడియో అప్‌లోడ్‌ అవుతుండగానే డిటెయిల్స్, రైట్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఇతరత్రా విభాగాలు కనిపిస్తాయి. వీటిల్లో ‘వీడియో ఎలిమెంట్స్‌’ విభాగంలో ‘యాడ్‌ సబ్‌టైటిల్స్‌’ ఫీచర్‌ ఉంటుంది. దీని కింద ఉండే ‘యాడ్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు అప్‌లోడ్‌ ఫైల్, ఆటో సింక్, టైప్‌ మాన్యువల్లీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.


అప్‌లోడ్‌ ఫైల్‌: అచ్చం వీడియోలో ఉన్నట్టుగానే స్క్రిప్టు ఫైలు అందుబాటులో ఉందనుకోండి. అప్పుడు ‘విత్‌ టైమింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కానీ వీడియో దృశ్యానికి అనుగుణంగా సబ్‌టైటిల్స్‌ కనిపించాలంటే ‘వితవుట్‌ టైమింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో యూట్యూబ్‌ తనకు తానే వీడియోకు తగినట్టుగా సబ్‌టైటిల్స్‌ను సింక్‌ చేసుకుంటుంది.

 ఆటో-సింక్‌: సబ్‌టైటిల్స్‌ను కాపీ చేసి పేస్ట్‌ కూడా చేసుకోవచ్చు. వీటిని వీడియోకు తగినట్టుగా యూట్యూబ్‌ తనకు తానే సింక్‌ చేసుకుంటుంది. 

టైప్‌ మ్యాన్యువల్లీ: దీని ద్వారా యూట్యూబ్‌ను చూస్తూ మాటలు ఉన్న చోట క్యాప్షన్స్‌ను టైప్‌ చేసుకోవచ్చు.

ఇవన్నీ పూర్తయ్యాక వీడియోకు అనుగుణంగా సబ్‌టైటిల్స్‌ వస్తున్నాయో లేదో సరి చూసుకోవాలి. కావాలంటే టైమ్‌స్టాంప్స్‌ ద్వారా టైమింగ్‌ను మార్చుకోవచ్చు. చివరికి వీడియో ప్రివ్యూను చూసుకోవాలి. టైటిల్స్‌లో ఏవైనా తప్పులు కనిపిస్తే సరి చేసుకోవాలి. దీంతో సబ్‌టైటిల్స్‌ను జోడించుకునే ప్రక్రియ పూర్తవుతుంది.  

ట్రాన్‌స్క్రైబ్‌ కూడా

కొన్నిసార్లు మన సొంత వీడియోకు సబ్‌టైటిల్స్‌ జోడించుకుంటే బాగుంటుందని అనిపించొచ్చు. కానీ చేతిలో స్క్రిప్టు అందుబాటులో లేకపోవచ్చు. దీనికీ పరిష్కార మార్గముంది. ట్రాన్‌స్క్రైబ్‌ చేసే యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా వీడియోను టెక్స్ట్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. ఇందుకు చాలా యాప్‌లే ఉన్నాయి. వీటిల్లో చాలా తేలికైంది, కచ్చితంగా అనువాదం చేసి పెట్టేది ఆటర్‌. ఇది అన్‌లైన్‌ ట్రాన్‌స్క్రైబింగ్‌ టూల్‌. 

* ముందుగా ఆటర్‌లోకి వెళ్లి, అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి. తర్వాత కుడివైపు పైన ఉండే ‘రికార్డు’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. విండోను క్లోజ్‌ చేయకుండా యూట్యూబ్‌ స్టుడియోలోకి వెళ్లాలి. సబ్‌టైటిల్స్‌ జోడించుకోవాలనుకునే వీడియోను ప్లే చేయాలి. ఆ వెంటనే ఆటర్‌ అప్పటికప్పుడు వీడియోను ట్రాన్‌స్క్రైబ్‌ చేయటం ఆరంభిస్తుంది. 

* వీడియో మొత్తం టెక్ట్స్‌ రూపంలోకి మారిన తర్వాత రికార్డింగ్‌ను ఆపేయాలి. ఇది కొద్దిసేపయ్యాక ప్రాసెస్‌ అయ్యి టెక్స్ట్‌ రూపంలో ‘మై కన్వర్జేషన్‌’ విభాగం కింద దర్శనమిస్తుంది. 

 తర్వాత టెక్స్ట్‌ ఫైలును క్లిక్‌ చేస్తే చాలు. ఈ టెక్స్ట్‌ను కాపీ చేసి గానీ ఎక్స్‌పోర్ట్‌ చేసి గానీ వీడియోకు జోడించుకోవచ్చు. అయితే ఒకసారి టెక్ట్స్‌ను చదివి, తప్పొప్పులు సరిచేసుకోవటం మరవద్దు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని