Whatsapp: స్క్రీన్‌ లాక్‌ అయినా వాట్సప్‌ రిప్లయి!

ఐఫోన్‌లో వాట్సప్‌ వాడుతున్నారా? స్క్రీన్‌ అన్‌లాక్‌ చేయకుండానే ఎప్పుడైనా మెసేజ్‌లకు జవాబు ఇవ్వటానికి ప్రయత్నించారా? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఐఫోన్‌ స్క్రీన్‌ లాక్‌ అయినా వాట్సప్‌ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వచ్చు. ఇందుకు ఐఫోన్‌లో వెసులుబాటు ఉంది.

Published : 01 Jun 2022 09:51 IST

ఐఫోన్‌లో వాట్సప్‌ వాడుతున్నారా? స్క్రీన్‌ అన్‌లాక్‌ చేయకుండానే ఎప్పుడైనా మెసేజ్‌లకు జవాబు ఇవ్వటానికి ప్రయత్నించారా? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఐఫోన్‌ స్క్రీన్‌ లాక్‌ అయినా వాట్సప్‌ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వచ్చు. ఇందుకు ఐఫోన్‌లో వెసులుబాటు ఉంది. కాకపోతే ఈ క్విక్‌ రిప్లయి ఆప్షన్‌ ఐఫోన్‌ 6ఎస్, ఐఫోన్‌ 13, 12, 11 వంటి కొత్త ఫోన్లకే అందుబాటులో ఉంటుంది. అన్‌లాక్‌ చేయకుండానే వాట్సప్‌ మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వాలనుకుంటే.. నోటిఫికేషన్‌ను ట్యాప్‌ చేసి గట్టిగా లేదా కాసేపు అలాగే వేలితో నొక్కాలి. జవాబును ఎంటర్‌ చేసి సెండ్‌ బటన్‌ను నొక్కాలి. ఇందుకోసం ముందుగానే హ్యాప్టిక్‌ సెటింగ్స్‌ను అడ్జస్ట్‌ చేసుకోవాలి. సెటింగ్స్‌లోకి వెళ్లి, యాక్సెసిబిలిటీ ద్వారా హ్యాప్టిక్‌ టచ్‌.. తర్వాత టచ్‌ సమయాన్ని సరి చేసుకోవాలి. ఇదొక్కటే కాదు.. వాట్సప్‌ మెసేజ్‌లను పంపుకోవటానికి, వాట్సప్‌ కాల్స్‌ చేయటానికి, మెసేజ్‌లను చదివి వినిపించటానికి సిరిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ 10.3, ఆ తర్వాతి ఫోన్లలో అందుబాటులో ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని