ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఫ్లూ!

ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఫ్లూ బెడద పట్టుకుంది. అంతలా ఆశ్చర్యపోకండి. ఫోన్లకు హానికర మాల్వేర్‌లే జబ్బులు మరి. ఇటీవల ఫ్లూబాట్‌ అనే ఆండ్రాయిడ్‌ మాల్వేర్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 11 దేశాలను చుట్టేసింది.

Updated : 08 Jun 2022 11:50 IST

ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఫ్లూ బెడద పట్టుకుంది. అంతలా ఆశ్చర్యపోకండి. ఫోన్లకు హానికర మాల్వేర్‌లే జబ్బులు మరి. ఇటీవల ఫ్లూబాట్‌ అనే ఆండ్రాయిడ్‌ మాల్వేర్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 11 దేశాలను చుట్టేసింది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వ్యాపించే ఇది పాస్‌వర్డ్‌లను, ఆన్‌లైన్‌ బ్యాంకిగ్‌ వివరాల వంటి రహస్య సమాచారాన్ని సేకరిస్తుంది. ఫ్లూబాట్‌ మాల్వేర్‌ను 2020, డిసెంబర్‌లో గుర్తించారు. అప్పట్నుంచీ విస్తరిస్తూనే వస్తోంది. ఇటీవల ఇంకాస్త ఎక్కువగా విజృంభిస్తోంది. ఇది టెక్స్ట్‌ మెసేజ్‌ల ద్వారా వ్యాపిస్తుంది. ముందు హానికర లింకులను క్లిక్‌ చేయమని అడుగుతుంది. క్లిక్‌ చేయగానే ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఇది కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు కాంటాక్టులను అప్‌లోడ్‌ చేస్తుంది. టార్గెట్‌ చేసుకున్న కాంటాక్టులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ మరింతగా విస్తరిస్తుంది. ఇది ఇన్‌బిల్ట్‌ భద్రత వ్యవస్థలను నిర్వీర్యం చేసి మరీ బ్యాంకింగ్‌ యాప్స్‌, క్రిప్టోకరెన్సీ ఖాతా వివరాలను నేరగాళ్లకు చేరవేస్తుండటం గమనార్హం. మరి ఫోన్‌లో ఫ్లూబాట్‌ ఇన్‌స్టాల్‌ అయితే ఏం చేయాలి? యాప్‌ను ట్యాప్‌ చేసినప్పుడు ఓపెన్‌ కాకపోయినా, యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయటానికి ప్రయత్నిస్తే ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చినా అది మాల్వేర్‌ అని అనుకోవచ్చు. వెంటనే ఫోన్‌ను ఫ్యాక్టరీ సెటింగ్స్‌కు రీసెట్‌ చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని