సామ్‌సంగ్‌ రిపేర్‌ మోడ్‌

ఫోన్‌ చెడిపోయింది. కంపెనీ సర్వీస్‌ సెంటర్‌లో మరమ్మతు చేయించాలి. లేదూ ఫోన్‌ మెకానిక్‌కు అయినా ఇవ్వాలి. ఫోన్‌ ఒక పూటలో బాగవుతుందా? కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. మరమ్మతుకు ఇచ్చేటప్పుడు ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి

Published : 03 Aug 2022 00:03 IST

ఫోన్‌ చెడిపోయింది. కంపెనీ సర్వీస్‌ సెంటర్‌లో మరమ్మతు చేయించాలి. లేదూ ఫోన్‌ మెకానిక్‌కు అయినా ఇవ్వాలి. ఫోన్‌ ఒక పూటలో బాగవుతుందా? కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. మరమ్మతుకు ఇచ్చేటప్పుడు ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం, రహస్య వివరాలుంటే? అందుకే ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేసేస్తుంటారు. వేరే పరికరంలో బ్యాకప్‌ అయినా తీసి పెట్టుకుంటారు. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి సామ్‌సంగ్‌ కొత్తగా రిపేర్‌ మోడ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాటే ఇదీ వస్తుంది. ముందుగా గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌ ఫోన్లకు ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకున్నాక ఎప్పుడైనా రిపేర్‌కు ఇవ్వాల్సి వస్తే దీన్ని వాడుకోవచ్చు. సెటింగ్స్‌ ద్వారా బ్యాటరీ అండ్‌ డివైస్‌ విభాగంలోకి వెళ్తే రిపేర్‌ మోడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే చాలు. మార్పులు చేయగానే ఫోన్‌ రీస్టార్ట్‌ అవుతుంది. అప్పుడు ఫొటోలు, వీడియోలు, మనం ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాప్స్‌ వంటివన్నీ అదృశ్యమైపోతాయి. ఫోన్‌తో పాటు డిఫాల్ట్‌గా వచ్చిన యాప్స్‌ మాత్రం అలాగే ఉంటాయి. దీని ద్వారా మన వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవచ్చు. ఫోన్‌ మరమ్మత్తు పూర్తయ్యాక పిన్‌ లేదా ఫింగర్‌ ప్రింట్‌ ఐడీతో డేటాను రిస్టోర్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని