ఫోన్‌తోనే మొక్కల గుర్తింపు

నర్సరీకో, తోటకో వెళ్లారు. ఏదో మొక్క ఆకర్షిస్తుంది. కానీ అదేం మొక్కో తెలియదు. తెలిసినా పేరు చప్పున గుర్తుకురాదు. మరెలా? జేబులో స్మార్ట్‌ఫోన్‌ ఉందిగా. ఉంటే ఏంటని అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్‌ ఫోన్‌ సాయంతో మొక్కల పేర్లను ఇట్టే తెలుసుకోవచ్చు మరి.

Published : 17 Aug 2022 01:15 IST

ర్సరీకో, తోటకో వెళ్లారు. ఏదో మొక్క ఆకర్షిస్తుంది. కానీ అదేం మొక్కో తెలియదు. తెలిసినా పేరు చప్పున గుర్తుకురాదు. మరెలా? జేబులో స్మార్ట్‌ఫోన్‌ ఉందిగా. ఉంటే ఏంటని అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్‌ ఫోన్‌ సాయంతో మొక్కల పేర్లను ఇట్టే తెలుసుకోవచ్చు మరి. ఇందుకు గూగుల్‌ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ముందుగానే గూగుల్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ అయ్యి ఉంటుంది. ఇది గూగుల్‌ లెన్స్‌ పరిజ్ఞానంతో అనుసంధానమై ఉండటం విశేషం. ఫోన్‌ కెమెరా ద్వారా మొక్కలు లేదా పువ్వులను గుర్తు పట్టటానికిది బాగా తోడ్పడుతుంది. దీన్ని వాడుకోవటమూ తేలికే.

* ముందుగా గూగుల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* సెర్చ్‌ బార్‌కు కుడివైపున ఉండే కెమెరా గుర్తు మీద ట్యాప్‌ చేయాలి. అప్పుడు కొన్ని అనుమతులు అడగొచ్చు. వీటికి అనుమతించాలి.

* అప్పటికే ఫోన్‌లో ఉన్న ఫొటోల్లోని మొక్కను గుర్తించాలని అనుకున్నారనుకోండి. యాప్‌లో ఉన్న ఫొటోలను స్క్రోల్‌ చేయాలి. పేరు తెలుసుకోవాలని భావిస్తున్న మొక్క లేదా పువ్వు ఫొటో మీద ట్యాప్‌ చేయాలి. ఒకట్రెండు సెకండ్లలోనే దానికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి.

* ఫొటో తీసి మొక్కను గుర్తించాలంటే.. ‘సెర్చ్‌ విత్‌ కెమెరా’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. భూతద్దం గుర్తు మీద నొక్కి ఫొటో తీసి, సెర్చ్‌ చేయాలి. వెంటనే అదేం మొక్కో, దాని పేరేంటో అన్నీ కనిపిస్తాయి.

బింగ్‌తోనూ..

బింగ్‌ మొబైల్‌ యాప్‌తోనూ మొక్కలు, పువ్వుల వివరాలు తెలుసుకోవచ్చు. గూగుల్‌ యాప్‌లో మాదిరిగానే దీనిలోనూ కెమెరాతో ఆయా మొక్కల ఫొటోలు తీయాలి. అప్పుడు బింగ్‌ ఆ ఫొటోను స్కాన్‌ చేసి అలాంటి మొక్కల ఫొటోలను చూపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని