5జీ ఫోన్‌ కొంటారా?

దేశంలోని పలు పట్టణాల్లో 5జీ సేవలు ఆరంభమయ్యాయి. రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ వంటి టెలికం సంస్థలు నిర్ణయించిన నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చాయి. 5జీని సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌ గలవారు ఈ నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చు.

Updated : 26 Oct 2022 04:29 IST

దేశంలోని పలు పట్టణాల్లో 5జీ సేవలు ఆరంభమయ్యాయి. రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ వంటి టెలికం సంస్థలు నిర్ణయించిన నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చాయి. 5జీని సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌ గలవారు ఈ నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకోవటానికి 5జీ సిమ్‌ ఏమీ అవసరం లేదు. మరి 5జీని సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా? దీనికి అప్‌గ్రేడ్‌ కావాలని అనుకుంటున్నారా? అయితే కాస్త చవకగా.. అందుబాటు ధరల్లో ఉన్న కొన్ని 5జీ ఫోన్లను చూద్దామా!


పోకో ఎం4 ప్రో 5జీ

శక్తిమంతమైన మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌తో  కూడుకొని ఉంది. కొన్ని ఆన్‌లైన్‌ అంగళ్లలో 15వేల లోపే లభిస్తోంది. 4జీబీ, 6జీబీ, 8జీబీ వేరియంట్లను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. ర్యామ్‌ను బట్టి స్టోరేజీ మారుతుంది. వెనక వైపున డ్యుయల్‌ కెమెరా సెటప్‌ (50 ఎంపీ, 8ఎంపీ).. ముందు వైపున 16 ఎంపీ కెమెరా.. 500ఎంఏహెచ్‌ లియాన్‌ బ్యాటరీ, 6.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 1 టీబీ వరకు ఎస్‌డీ కార్డును సపోర్టు చేసే హైబ్రిడ్‌ స్లాట్ కూడా ఉంటుంది.


రెడ్‌మీ నోట్‌ 11టీ 5జీ

ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ రెజల్యూషన్‌తో కూడిన 6.6 అంగుళాల తెర, 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ వేగం దీని సొంతం. మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో కూడిన ఇది రోజువారీ వ్యవహారాలు నిరంతరాయంగా చేసుకోవటానికి తోడ్పడుతుంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ రామ్‌ కలిగుంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌.. వెనకవైపున మూడు కెమెరాలు (50ఎంపీ, 8 ఎంపీ, 16 ఎంపీ).. ఎంఐయూఐ 12.5 ఆధారిత ఆండ్రాయిడ్‌ 11 వంటి సాధనాలున్నాయి. దీన్ని కొన్నవారికి 2 నెలల పాటు యూట్యూబ్‌ ప్రీమియం ఉచితంగా లభిస్తుంది కూడా.


సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ

ఇది 6జీబీ ర్యామ్‌, 126 జీబీ స్టోరేజీతో అలరిస్తోంది. ఆండ్రాయిడ్‌ 12తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ డీ700 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ దీని సొంతం. వెనక వైపున రెండు కెమెరాలు (50ఎంపీ, 2ఎంపీ), ముందు కెమెరా 5ఎంపీ.. 5000ఎంఏహెచ్‌ లియాన్‌ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.


రియల్‌మీ 9ఐ 5జీ

దీని ఫీచర్ల విషయానికి వస్తే- వెనక వైపున మూడు కెమెరాలు (50ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ), ముందు వైపున 8ఎంపీ కెమెరా, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 5జీ చిప్‌సెట్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ, మెమరీ కార్డు స్లాట్‌, 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ వేగంతో కూడిన 6.6 అంగుళాల తెర వంటివి ప్రత్యేకం.


ఐక్యూ జెడ్‌6 లైట్‌ 5జీ, రెడ్‌మీ 11 ప్రైమ్‌ 5జీ, సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌23 5జీ, పోకో ఎం4 5జీ వంటివీ అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని