టెక్స్ట్‌ సెలెక్ట్‌ షార్ట్‌కట్స్‌

వెబ్‌ పేజీలో ఏదో చదువుతుంటాం. విషయం ఆసక్తికరంగా ఉంటుంది. వెంటనే కాపీ చేసుకొని వర్డ్‌ప్యాడ్‌లో సేవ్‌ చేసుకోవాలనుకోవచ్చు. లేదూ ఇతరులతో షేర్‌ చేసుకోవాలనీ అనిపించొచ్చు. రోజూ ఇలాంటి సందర్భాలను తరచూ ఎదుర్కొంటూనే ఉంటాం.

Published : 26 Oct 2022 00:15 IST

వెబ్‌ పేజీలో ఏదో చదువుతుంటాం. విషయం ఆసక్తికరంగా ఉంటుంది. వెంటనే కాపీ చేసుకొని వర్డ్‌ప్యాడ్‌లో సేవ్‌ చేసుకోవాలనుకోవచ్చు. లేదూ ఇతరులతో షేర్‌ చేసుకోవాలనీ అనిపించొచ్చు. రోజూ ఇలాంటి సందర్భాలను తరచూ ఎదుర్కొంటూనే ఉంటాం. కంప్యూటర్‌ మీద మౌజ్‌తో టెక్స్ట్‌ను సెలెక్ట్‌, కాపీ చేసుకోవటం తేలికే. షార్ట్‌కట్స్‌తోనైతే ఇది మరింత తేలికవుతుంది. ఉదాహరణకు- విండోస్‌లో కంట్రోల్‌, ఏ మీటలను.. మ్యాక్‌ఓఎస్‌లో కమాండ్‌, ఏ మీటలను కలిపి నొక్కితే వెబ్‌ పేజీలోనైనా, డాక్యుమెంట్‌లోనైనా మొత్తం టెక్స్ట్‌ సెలెక్ట్‌ అవుతుంది. తర్వాత కంట్రోల్‌/కమాండ్‌, సి మీటలను నొక్కితే కాపీ అవుతుంది. పేస్ట్‌ చేయటానికి కంట్రోల్‌/కమాండ్‌, వీ బటన్లను నొక్కితే చాలు. సెలెక్ట్‌ చేసుకున్న అంశం మీద రైట్‌ క్లిక్‌ చేసి కూడా కాపీ, పేస్ట్‌ చేసుకోవచ్చు. ఇందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలూ ఉన్నాయి. షిఫ్ట్‌, ఎడమ బాణం మీటలను నొక్కితే కర్సర్‌ ఉన్నచోటు నుంచి ఎడమవైపు అక్షరాలు, కుడి బాణం మీటను నొక్కితే కుడివైపు అక్షరాలు సెలెక్ట్‌ అవుతాయి. షిఫ్ట్‌, ఎండ్‌ బటన్లను నొక్కితే వాక్యం చివరి వరకూ ఎంచుకోవచ్చు. షిఫ్ట్‌, పై లేదా కింది బాణం మీటలను నొక్కితే కర్సర్‌ ఉన్నచోటుకు సరిగ్గా పై, కింది వాక్యాలనూ ఎంచుకోవచ్చు. షిఫ్ట్‌తో పాటు కంట్రోల్‌ బటన్లనూ నొక్కితే ఒకో అక్షరం కాకుండా మొత్తం పదాన్ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. షిఫ్ట్‌, హోం బటన్లను నొక్కితే కర్సర్‌కు ఎడమ వైపు వాక్యం.. షిఫ్ట్‌, ఎండ్‌ బటన్లను నొక్కితే కుడి వైపు వాక్యం మొత్తం సెలెక్ట్‌ అవుతుంది. కంట్రోల్‌, షిఫ్ట్‌, హోం బటన్లను కలిపి నొక్కారనుకోండి. కర్సర్‌కు పైన ఉన్న మొత్తం టెక్స్ట్‌ను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అదే కంట్రోల్‌, షిఫ్ట్‌, ఎండ్‌ బటన్లను నొక్కితే కర్సర్‌కు కింద ఉన్న టెక్స్ట్‌ అంతా సెలెక్ట్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు