విండోస్‌ 7, 8.1 వాడుతున్నారా?

విండోస్‌ 7, విండోస్‌ 8.1 ఓఎస్‌ పరికరాలు వాడుతున్నారా? అయితే విండోస్‌ 10, ఆపై ఓఎస్‌కు మారిపోవటం మంచిది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విండోస్‌ 7, 8.1లకు సపోర్టు నిలిపేస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది.

Published : 02 Nov 2022 00:16 IST

విండోస్‌ 7, విండోస్‌ 8.1 ఓఎస్‌ పరికరాలు వాడుతున్నారా? అయితే విండోస్‌ 10, ఆపై ఓఎస్‌కు మారిపోవటం మంచిది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విండోస్‌ 7, 8.1లకు సపోర్టు నిలిపేస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. కొత్త క్రోమ్‌ 110 వర్షన్‌ విడుదలతోనే దీన్ని అమలు చేయొచ్చని భావిస్తున్నారు. అంటే విండోస్‌ 7, 8.1 ఓఎస్‌లకు సపోర్టు చేయటం అధికారికంగా నిలిచి పోనుందన్నమాట. వీటికి కొత్త అప్‌డేట్లు అందవు. కానీ పాత క్రోమ్‌ వర్షన్‌ పనిచేస్తూనే ఉంటుంది. క్రోమ్‌ సెక్యూరిటీ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు కావాలంటే మాత్రం విండోస్‌ 10, ఆ తర్వాతి ఓఎస్‌లకు మారాల్సిందే. అన్ని బ్రౌజర్లలో అత్యంత దుర్బలమైన, దాడులకు అనువైనది క్రోమేనని ఇటీవల ఒక నివేదిక పేర్కొంది. అంటే వైరస్‌ల వంటివి దాడి చేయటానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కొత్త క్రోమ్‌ వర్షన్‌ వీటికి కళ్లెం వేయగలదని భావిస్తున్నారు. సెక్యూరిటీ అప్‌డేట్‌తో పటిష్టం కావొచ్చని అనుకుంటున్నారు. కాబట్టి పాత ఓఎస్‌లను వాడకపోవటమే మంచిదని అభిప్రాయ పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని