12 గంటల విధానానికి మారేదెలా?

కొత్త పీసీ కొన్నారా? అది విండోస్‌ ఓఎస్‌తో నడుస్తోందా? అయితే గడియారం 24 గంటల పద్ధతిలో సమయాన్ని చూపించటం గమనించే ఉంటారు.

Updated : 14 Dec 2022 01:26 IST

కొత్త పీసీ కొన్నారా? అది విండోస్‌ ఓఎస్‌తో నడుస్తోందా? అయితే గడియారం 24 గంటల పద్ధతిలో సమయాన్ని చూపించటం గమనించే ఉంటారు. గోడ గడియారమైనా, చేతి గడియారమైనా అన్నీ 12 గంటల ఫార్మాట్‌లో సమయాన్ని సూచిస్తాయి. మనకు మొదట్నుంచీ ఈ పద్ధతే అలవాటు. మరి పీసీలో సమయం పద్ధతిని మార్చుకోవటమెలా?

* ముందుగా పీసీ అడుగున ఎడమవైపు కనిపించే విండోస్‌ గుర్తు మీద క్లిక్‌ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లి, ‘టైమ్‌ అండ్‌ లాంగ్వేజెస్‌’ను ఎంచుకోవాలి.

* అందులో ‘డేట్‌ అండ్‌ టైమ్‌’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసి, ‘లాంగ్వేజ్‌ అండ్‌ రీజియన్‌’ను ఎంచుకోవాలి.

* ‘రీజినల్‌ ఫార్మాట్‌’ మీద నొక్కితే ‘ఛేంజ్‌ ఫార్మాట్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇందులో షార్ట్‌ టైమ్‌ మీద క్లిక్‌ చేసి డ్రాప్‌ డౌన్‌ మెనూలో 9.40 ఎ.ఎం. ఎంచుకోవాలి. అలాగే లాంగ్‌ టైమ్‌ మీద నొక్కి 9.40.07 ఎ.ఎం. ఎంచుకోవాలి.

* ఈ మార్పులు చేశాక సెటింగ్స్‌ విండోస్‌ను క్లోజ్‌ చేయాలి. దీంతో టైమ్‌ ఫార్మాట్‌ 24 గంటల పద్ధతి నుంచి 12 గంటల పద్ధతికి మారిపోతుంది. ఒకవేళ తిరిగి 24 గంటల పద్ధతికి మారాలంటే ఇలాగే సెటింగ్స్‌ ద్వారా వెళ్లి షార్ట్‌ టైమ్‌ డ్రాప్‌ డౌన్‌ మెనూలో 9.40ని.. లాంగ్‌ టైమ్‌ డ్రాప్‌ డౌన్‌ మెనూలో 9.40.07ను ఎంచుకోవాలి.

* ఇదే సెటింగ్స్‌ మెనూ ద్వారా టైమ్‌ జోన్‌, రీజియన్‌ వంటి వాటినీ మార్చుకోవచ్చు. అదనపు గడియారాలనూ జోడించుకోవచ్చు. వివిధ టైమ్‌ జోన్లలో వేర్వేరు ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణించేవారికిది బాగా ఉపయోగపడుతుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని