ఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌ టీవీకి ఫైళ్లు

ఆండ్రాయిడ్‌ టీవీలు రోజురోజుకీ ఆదరణ పొందుతున్నాయి. వీటిల్లో పెన్‌డ్రైవ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా సినిమాలు, ఫొటోలు, ఫైళ్లు చేరవేయొచ్చు.

Published : 29 Mar 2023 00:06 IST

ఆండ్రాయిడ్‌ టీవీలు రోజురోజుకీ ఆదరణ పొందుతున్నాయి. వీటిల్లో పెన్‌డ్రైవ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా సినిమాలు, ఫొటోలు, ఫైళ్లు చేరవేయొచ్చు. మరి పెన్‌డ్రైవ్‌ లేకపోతే? దీనికీ ఒక మార్గముంది. అదే సెండ్‌ ఫైల్స్‌ టు టీవీ యాప్‌. దీన్ని ఫోన్‌లో, ఆండ్రాయిడ్‌ టీవీ రెండింటిలోనూ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అవసరమైన అనుమతులు ఇచ్చాక స్మార్ట్‌ఫోన్‌ ద్వారా టీవీలోకి ఫైళ్లు పంపొచ్చు. టీవీ నుంచీ ఫోన్‌లోకి తెచ్చుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్‌ కూడా అవసరం లేదు. స్థానిక నెట్‌వర్క్‌తో అనుసంధానమైనా చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు