బాస్‌పాడ్స్‌ ఇయర్‌బడ్స్‌

పిట్రాన్‌ సంస్థ సరికొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను ప్రవేశపెట్టింది. పేరు బాస్‌పాడ్స్‌ ఎన్‌కోర్‌. అధునాతన నాయిస్‌ క్యాన్సెలింగ్‌ టెక్నాలజీ దీని ప్రత్యేకత. ఇది చుట్టుపక్కల శబ్దాలను 30 డెసిబెల్స్‌ వరకు తగ్గించగలదు.

Published : 05 Apr 2023 00:38 IST

పిట్రాన్‌ సంస్థ సరికొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను ప్రవేశపెట్టింది. పేరు బాస్‌పాడ్స్‌ ఎన్‌కోర్‌. అధునాతన నాయిస్‌ క్యాన్సెలింగ్‌ టెక్నాలజీ దీని ప్రత్యేకత. ఇది చుట్టుపక్కల శబ్దాలను 30 డెసిబెల్స్‌ వరకు తగ్గించగలదు. అంటే రణగొణధ్వనుల మధ్య ఉన్నా శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుందన్నమాట. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 50 గంటల వరకు బ్యాటరీ పనిచేస్తుంది. అందువల్ల రోజుల తరబడి నిరాటంకంగా వాడుకోవచ్చు. ఛార్జింగ్‌ కేస్‌ సాయంతో ఎన్నిసార్లయినా ఇయర్‌బడ్స్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. బ్లూటూత్‌ 5.3 టెక్నాలజీతో కూడిన ఇవి త్వరగా పరికరాలకు కనెక్ట్‌ అవుతాయి. స్థిరంగా పనిచేస్తాయి. మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌, కాల్స్‌ అందుకోవటం, ముగించటం.. సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌ వంటి వాయిస్‌ అసిస్టెంట్లను తేలికగా యాక్సెస్‌ చేయటానికి టచ్‌ కంట్రోల్స్‌ ఫీచర్‌ కూడా ఉంది. కాబట్టి రోజువారీ పనుల్లో బాగా తోడ్పడతాయి. ఐపీఎక్స్‌4 వాటర్‌ రెసిస్టెంట్‌ టెక్నాలజీ సైతం ఉండటం వల్ల ఆరుబయట వాడుకోవటానికి అనువుగా ఉంటాయి. ఏడాది వారెంట్‌తో లభించే దీని అసలు ధర రూ.1,199. ప్రత్యేక ఆరంభ ఆఫర్‌తో ఇది ఫ్లిప్‌కార్టులో రూ.899కే లభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని