వర్డ్‌ డాక్యుమెంట్‌ సేవ్‌ కాలేదా?

వర్డ్‌ డాక్యుమెంట్‌లో విలువైన సమాచారాన్ని టైప్‌ చేస్తున్నారు. అయితే ఫైల్‌ ఉన్నట్టుండి సేవ్‌ కాకుండా క్లోజ్‌ అయ్యింది. ఆటో సేవ్‌ మోడ్‌ కూడా పెట్టుకోలేదు. అయినా కంగారు పడాల్సిన పని లేదు.

Published : 05 Apr 2023 00:38 IST

ర్డ్‌ డాక్యుమెంట్‌లో విలువైన సమాచారాన్ని టైప్‌ చేస్తున్నారు. అయితే ఫైల్‌ ఉన్నట్టుండి సేవ్‌ కాకుండా క్లోజ్‌ అయ్యింది. ఆటో సేవ్‌ మోడ్‌ కూడా పెట్టుకోలేదు. అయినా కంగారు పడాల్సిన పని లేదు. మై కంప్యూటర్‌లో ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లోకి వెళ్లి .తిళీదీ అని టైప్‌ చేసి చూడండి. డిలీట్‌ అయిన ఫైలు అక్కడ కనిపించొచ్చు. సేవ్‌ చేయని డాక్యుమెంట్లను తిరిగి పొందటానికి మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన ఫార్మాట్‌ ఇది. దీన్ని ఓపెన్‌ చేసినప్పుడు కొంత సమాచారం పోయినప్పటికీ చాలావరకు తిరిగి పొందొచ్చు. క్రాష్‌ అయిన ఫైళ్లు, ఫైళ్ల పాత వర్షన్లను గుర్తించటానికీ ఇది తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు