సాగే, వంగే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే

అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లలో ఓఎల్‌ఈడీ తెరలకు ప్రాచుర్యం పెరుగుతోంది. ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ తెరల కన్నా తక్కువ విద్యుత్తు తీసుకోవటం, దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తుండటం మూలంగా రోజురోజుకీ బాగా ఆదరణ పొందుతున్నాయి.

Published : 19 Apr 2023 00:21 IST

త్యాధునిక స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లలో ఓఎల్‌ఈడీ తెరలకు ప్రాచుర్యం పెరుగుతోంది. ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ తెరల కన్నా తక్కువ విద్యుత్తు తీసుకోవటం, దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తుండటం మూలంగా రోజురోజుకీ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ ఓఎల్‌ఈడీ తెరల్లో కండక్టర్ల మధ్య అతి చిన్న కర్బన సంబంధ అణువులుంటాయి. విద్యుత్‌ ప్రవహించే సమయంలో ఈ అణువులు ప్రకాశవంతమైన కాంతిని వెలువరిస్తాయి. అయితే ఈ అణు భాగాల్లో బిగుతైన రసాయన బంధాలు, కఠినమైన నిర్మాణాలు ఉంటాయి. అందువల్ల వంగటానికి వీలుండవు. ముడుచుకునే, సాగే తెరల పరికరాలకు ఇవి సరిపడవు. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి షికాగో యూనివర్సిటీ ఇంజినీర్లు కొత్తరకం ఓఎల్‌ఈడీ తెరలను రూపొందించారు. ఇవి సగం వరకు వంగుతాయి. రెండు రెట్ల కన్నా ఎక్కువగా సాగుతాయి. అయినా కాంతిని వెలువరిస్తూనే ఉంటాయి. శరీరానికి ధరించే పరికరాలు, మడవటానికి వీలుగల కంప్యూటర్‌ తెరల వంటి అత్యాధునిక పరికరాల తయారీకివి వీలు కల్పిస్తాయని భావిస్తున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని, గుండె వేగాన్ని కొలిచే సెన్సర్లు రక్త ప్రవాహాన్ని పసిగట్టటానికి రక్తనాళాల్లోకి కాంతిని ప్రసరింపజేస్తాయి. ఇలాంటి పరికరాల తయారీకీ కొత్త ఓఎల్‌ఈడీ పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు