ఐఫోన్‌లో సొంత రింగ్‌టోన్‌

ఐఫోన్‌లో హోం స్క్రీన్‌ మీద వాల్‌పేపర్‌ మార్చుకోవటం, లాక్‌ స్క్రీన్, విడ్జెట్స్‌ జత చేయటం వంటివి తప్పితే ఫీచర్లను ఇష్టమైనట్టుగా మార్చుకునే అవకాశం తక్కువ. షార్ట్‌కట్స్‌ యాప్‌తో ఐకన్లను మార్చుకోవచ్చు గానీ అదో పెద్ద ప్రయాస. అయితే ఇష్టమైన రింగ్‌టోన్‌ను పెట్టుకునే అవకాశముంది.

Published : 29 May 2024 00:07 IST

ఐఫోన్‌లో హోం స్క్రీన్‌ మీద వాల్‌పేపర్‌ మార్చుకోవటం, లాక్‌ స్క్రీన్, విడ్జెట్స్‌ జత చేయటం వంటివి తప్పితే ఫీచర్లను ఇష్టమైనట్టుగా మార్చుకునే అవకాశం తక్కువ. షార్ట్‌కట్స్‌ యాప్‌తో ఐకన్లను మార్చుకోవచ్చు గానీ అదో పెద్ద ప్రయాస. అయితే ఇష్టమైన రింగ్‌టోన్‌ను పెట్టుకునే అవకాశముంది. ఫోన్‌ చేసినప్పుడు అవతలివారు తేలికగా గుర్తుపట్టటానికి ప్రత్యేకమైన రింగ్‌టోన్‌ను సెట్‌ చేసుకోవాలని భావిస్తుంటారు. ఐఫోన్లలో రింగ్‌టోన్‌ను మార్చుకోవచ్చు గానీ ప్రత్యేకమైంది కావాలంటే యాప్‌ స్టోర్‌ నుంచి కొనుక్కోవాల్సిందే. లేదా ముందుగా సెట్‌ చేసిన ఆప్షన్లనైనా వాడుకోవాలి. దీనికి మూడో ప్రత్యామ్నాయం లేకపోలేదు. అదే సొంతంగా, ఇష్టమైనట్టుగా రింగ్‌టోన్‌ను సృష్టించుకోవటం. ఇందుకోసం..

  • ఐఫోన్‌లో గ్యారేజీబ్యాండ్‌ను ఓపెన్‌ చేయాలి.
  • ట్రాక్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి, స్వైప్‌ చేస్తూ వెళ్తే ఆడియో రికార్డర్‌ విభాగం కనిపిస్తుంది.
  • లూప్‌ బ్రౌజర్‌ గుర్తు మీద తాకి ఫైల్స్‌ యాప్‌ నుంచి ఆడియో ఫైలును ఇంపోర్టు చేసుకోవాలి. దీన్ని గ్యారేజీబ్యాండ్‌ వర్క్‌స్పేస్‌లోకి తీసుకురావాలి. గరిష్ఠ నిడివి 30 సెకండ్ల వరకూ కట్‌ చేసుకోవాలి. పైన ఎడమ మూలన ఉండే కిందికి చూసే బాణం గుర్తును తాకి సేవ్‌ చేసుకోవాలి.
  • తర్వాత మై సాంగ్స్‌లోకి వెళ్లి షేర్‌ ఆప్షన్‌ ద్వారా యాజ్‌ ఏ రింగ్‌టోన్‌ రూపంలో ఎక్స్‌పోర్ట్‌ చేసుకోవాలి.
  • అంతే. దాన్ని ఫోన్‌ రింగ్‌టోన్‌గా లేదా కాంటాక్ట్స్‌ రింగ్‌టోన్‌గా సెట్‌ చేసుకుంటే సరి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని