కాలుష్య నిరోధ హెల్మెట్‌!

ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌ తలకు దెబ్బలు తగలకుండా కాపాడుతుందని తెలుసు. ఇది స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటానికీ తోడ్పడుతుందని తెలుసా? దిల్లీలోని షీలియోస్‌ టెక్నోల్యాబ్స్‌ ఇలాంటి చిత్రమైన శిరస్త్రాణాన్నే రూపొందించింది.

Published : 24 Aug 2022 00:39 IST

ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌ తలకు దెబ్బలు తగలకుండా కాపాడుతుందని తెలుసు. ఇది స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటానికీ తోడ్పడుతుందని తెలుసా? దిల్లీలోని షీలియోస్‌ టెక్నోల్యాబ్స్‌ ఇలాంటి చిత్రమైన శిరస్త్రాణాన్నే రూపొందించింది. దీనికి గాలిని శుద్ధి చేసే పరికరాలుంటాయి. పేటెంట్‌ పొందిన పరిజ్ఞానాలతో కూడిన బ్రష్‌లెస్‌ డీసీ బ్లోయర్‌ ఫ్యాన్‌, హై-ఎఫిసియెన్సీ పార్టిక్యులేట్‌ ఎయిర్‌ ఫిల్టర్‌ మెంబ్రేన్‌, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌, మైక్రో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్‌తో కూడిన ఇది బ్లూటూత్‌ యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. కాలుష్యం బాగా పోగుపడినప్పుడు ఈ యాప్‌ హెల్మెట్‌ను శుభ్రం చేసుకోవాలనీ సూచిస్తుంది. దీని బరువు ఒకటిన్నర కిలోలు. ధర రూ.4,500. దీన్ని దేశంలోని చాలా ప్రాంతాల్లో అమ్ముతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని