వేసవిలో ఎక్కువ తిండి!

చలికాలంలో ఎక్కువగా తింటుంటామని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి మగవారు వేసవిలోనే ఎక్కువగా తింటున్నట్టు ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ పరిశోధకులు గుర్తించారు. ఆకలిని పుట్టించే హార్మోన్‌ను చర్మం విడుదల చేసేలా సూర్యరశ్మి ప్రేరేపిస్తుండటమే దీనికి కారణం.

Published : 24 Aug 2022 00:39 IST

చలికాలంలో ఎక్కువగా తింటుంటామని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి మగవారు వేసవిలోనే ఎక్కువగా తింటున్నట్టు ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ పరిశోధకులు గుర్తించారు. ఆకలిని పుట్టించే హార్మోన్‌ను చర్మం విడుదల చేసేలా సూర్యరశ్మి ప్రేరేపిస్తుండటమే దీనికి కారణం. ఎలుకలను అతి నీలలోహిత కాంతి ప్రభావానికి గురిచేయగా మగ ఎలుకలు ఎక్కువగా తింటున్నట్టు తేలింది. ఎలుకలు సరే.. ఇది మనుషుల మీదా ఇలాంటి ప్రభావమే చూపుతుందా? దీన్ని తెలుసుకోవటానికే ఒక సర్వే నిర్వహించారు. సంవత్సరంలో మిగతా రోజులతో పోలిస్తే ఎండ ఎక్కువగా కాసే రోజుల్లో సగటున రోజుకు 1.7 శాతం ఎక్కువ కేలరీలు తీసుకున్నట్టు గుర్తించారు. అయితే మహిళలు ఎక్కువగా ఏమీ తినకపోవటం విశేషం. సాధారణంగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలిని పుట్టించే ఘ్రెలిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది జీర్ణాశయంలో మాత్రమే ఉత్పత్తి అవుతుందని భావిస్తూ వస్తున్నారు. అయితే ఎండ ప్రభావంతో చర్మంలోని కొవ్వు కణాలు సైతం ఘ్రెలిన్‌ను విడుదల చేస్తున్నట్టు, ఫలితంగా దీని మోతాదులు పెరుగుతున్నట్టు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని