జీమెయిలానందం!

ఇ-మెయిల్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జీమెయిల్‌. అంతటి ఆదరణ పొందింది మరి. దీనికి కారణం బోలెడన్ని ఫీచర్లు. ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా వాడుకున్నా జీమెయిల్‌లో ఒకట్రెండు తెలియని ఫీచర్లు ఉంటూనే ఉంటాయి.

Updated : 24 Aug 2022 17:39 IST

ఇ-మెయిల్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జీమెయిల్‌. అంతటి ఆదరణ పొందింది మరి. దీనికి కారణం బోలెడన్ని ఫీచర్లు. ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా వాడుకున్నా జీమెయిల్‌లో ఒకట్రెండు తెలియని ఫీచర్లు ఉంటూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని ఇవి..

మెయిల్‌ చిరునామాలో చుక్కలు
చాలా ఈమెయిల్‌ చిరునామాల చివర ఫుల్‌స్టాప్‌ ఉంటుంది. కానీ జీమెయిల్‌ ఫుల్‌స్టాప్‌లను చదవలేదనే సంగతి మీకు తెలుసా? g.m.ail.enth.usi.a.st @gmail.com  అని రాసినా gmailenthusiast@gmail.com. అని రాసినా ఒకేలా పరిగణిస్తుంది. ఏదైనా ఫ్రీ ట్రయల్‌ కోసం సైన్‌ అప్‌ చేస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. అసలు చిరునామాలోనే ఫుల్‌స్టాప్‌లు పెట్టి వివిధ మెయిళ్లుగా వాడుకోవచ్చు. మన ఈమెయిల్‌ చిరునామాలో ఎవరైనా ఎక్కువ ఫుల్‌స్టాప్‌లు పెట్టినా, తక్కువ ఫుల్‌స్టాప్‌లు పెట్టినా అవి మనకు అందుతాయి.

ప్రివ్యూ ప్యానెల్‌
మరో మంచి ఫీచర్‌ రీడింగ్‌ పేన్‌. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే ఇన్‌బాక్స్‌ రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకవైపు ఈమెయిళ్ల జాబితా కనిపిస్తే, రెండో వైపున క్లిక్‌ చేసిన ఈమెయిల్‌ దర్శనమిస్తుంది. ఈ రీడింగ్‌ పేన్‌ కుడివైపున ఉండాలా? కిందనా? అనేదీ నిర్ణయించుకోవచ్చు. దీన్ని ఆన్‌ చేసుకోవటానికి జీమెయిల్‌ ల్యాబ్స్‌లోకి వెళ్లి, కాగ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. అనంతరం సెటింగ్స్‌ ద్వారా ల్యాబ్స్‌లోకి వెళ్లి ప్రివ్యూ పేన్‌ను ఎనేబుల్‌ చేసుకొని, సేవ్‌ ఛేంజెస్‌ను నొక్కాలి.
గ్రూప్‌ ఈమెయిళ్లతో ఇబ్బంది పడకుండా
ఏదైనా గ్రూప్‌నకు మెయిల్‌ను పంపించినప్పుడు అంతా రిప్లయి ఆల్‌ను హిట్‌ చేస్తుంటారు. దీంతో ఇన్‌బాక్స్‌ నిండిపోతుంది. పదే పదే అందే నోటిఫికేషన్లు చేసే పనికి ఆటంకం కలిగిస్తుంటాయి. ఇలా ఇబ్బంది పడకుండా ఈమెయిల్‌ థ్రెడ్‌ను మ్యూట్‌లో పెట్టుకునే అవకాశముంది. దీంతో వీలున్నప్పుడు మెయిళ్లను చదువుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మెసేజ్‌ను ఓపెన్‌ చేసి టాప్‌ బార్‌ మీదుంటే మోర్‌ను క్లిక్‌ చేయాలి. అందులో మ్యూట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే. ఆయా కన్వర్జేషన్లకు సంబంధించిన కొత్త మెసేజ్‌లన్నీ వస్తున్నా అలర్ట్‌లు అందవు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని