వాతావరణ మార్పును వింటారా?

డేటా అనగానే అంకెలు, గ్రాఫ్‌లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్‌ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్‌ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు.

Published : 29 May 2024 00:06 IST

డేటా అనగానే అంకెలు, గ్రాఫ్‌లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్‌ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్‌ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు. దీనికి ‘స్ట్రింగ్‌ క్వార్టర్‌ నం.1 పోలార్‌ ఎనర్జీ బడ్జెట్‌’ అని నామకరణం చేశారు. ఆయన ముందుగా డేటాను శబ్దం రూపంలోకి (సోనిఫికేషన్‌) మలచారు. డేటా విలువల ఆధారంగా వాటికి శబ్దాల స్థాయులను కేటాయించారు. వీటి ఆధారంగా వయొలిన్, వయోలా, సెల్లో వాయిద్యాలతో నలుగురు కళాకారులు పాటగా మలచారు. సంగీతం ద్వారా వాతావరణ మార్పు సంక్లిష్టతలను వ్యక్తం చేయటం హిటోరీ నగాయ్‌ ఉద్దేశం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని