Updated : 24 Feb 2021 16:47 IST

ఓ మంచి ప్రారంభానికి..

‘యాప్‌’రే!

గత ఏడాదంతా ఊహించని ట్విస్ట్‌లు. వాటిని ఎదుర్కొనేందుకు ఎన్నింటినో ఆసరాగా వాడుకున్నాం. వాటిల్లో నిత్యం చేతిలో ఉండే స్మార్ట్‌ ఫోన్‌ ఒకటి. మునివేళ్లపైనే ఎన్నో ప్రయోజనాల్ని అందించిన యాప్‌లు కొన్ని. మరి, ఈ కొత్త ఏడాది సంగతేంటి? రానున్న కాలాన్ని ఆహ్లాదకరంగా గడపాలను కుంటున్నారా? అయితే, ఈ యాప్‌లను ప్రయత్నించండి.


చాటి చెప్పండి..
* Anchor

తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొడంత. దీన్ని నమ్మితే నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. అలా నేర్చుకున్న వాటిని నలుగురితో పంచుకుంటే.. అందుకు తగిన వేదికే ఇది. చేతిలో ఫోన్‌ ఉంటే చాలు.. అప్పటికప్పుడు రికార్డు చేసి పోడ్కాస్ట్‌లో షేర్‌ చేయొచ్చు. ఉదాహరణకు కొత్త ఏడాదిలో మీరు చేపట్టిన స్టార్టప్‌ జర్నీని ఓ పోడ్కాస్ట్‌ రూపంలో పంచుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. పేరొందిన పోడ్కాస్ట్‌లలోనూ మీ రికార్డింగ్స్‌ని జత చేయొచ్చు. నలుగురు గెస్ట్‌లతోనూ చర్చలు జరపొచ్చు.                                           
డౌన్‌లోడ్‌ లింక్‌: 
http://bit.ly/38KZyPJ


‘జేబు’లో వేసుకోండి
* Pocket

ఇంటి గడప దాటలేని స్థితిలో.. విహారమంతా నెట్టింట్లోనే. ఫోన్‌, ట్యాబ్‌, పీసీ.. దేంట్లో ఒక దాంట్లో బ్రౌజ్‌ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో విలువైన సమాచారంతో కూడిన ఏ కంటెంట్‌ అయినా కనిపిస్తే.. దాన్ని భద్రంగా లైబ్రరీలా పెట్టుకునేందుకు చక్కని వేదిక. వ్యాసాలు, వార్తాంశాలు, వీడియోలు.. ఏవైనా ‘పాకెట్‌’లో పెట్టుకోవచ్చు. సమయం చిక్కినప్పుడు తిరిగి వాటిని ఓపెన్‌ చేసి రివ్యూ చేయొచ్చు. వ్యాసాల్ని చదివేందుకు కుదరకపోతే వినొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌:
http://bit.ly/2X8JqlL


డైరీ రాయండి..

* Grid Diary

మంచో.. చెడో.. విజయమో.. ఓటమో.. ఏదైనా ఆ క్షణానికి ఓ జ్ఞాపకమే. నేర్చుకునే పాఠమే. అలాంటి విలువైన జీవితాన్ని డైరీ రూపంలో పదిలం చేసుకోవడం మంచి అలవాటు. మీకు అలా డైరీ రాసే అలవాటు ఉన్నా.. లేదా కొత్తగా రాద్దాం అని నిర్ణయించుకున్నా.. ఈ యాప్‌ని ప్రయత్నించొచ్చు. సులువైన ఇంటర్ఫేస్‌తో, విభాగాలుగా డైరీని డిజైన్‌ చేశారు. స్పష్టమైన ఉద్దేశంతో డైరీ రాసేవారికి ఈ డైరీ యాప్‌ ఎంతో ప్రయోజనకరం. రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చో తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మర్చిపోతే.. డైరీనే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అదే దీంట్లోని ప్రత్యేకత.
డౌన్‌లోడ్‌ లింక్‌:
http://bit.ly/3aQWeoD


ధ్యాన గురువు
* calm
 

మానసికంగా బలపడినప్పుడు ఆరోగ్యంతో పాటు ఆనందమూ సొంతమవుతుంది. అందుకే ఈ యాప్‌. గతం తాలూకు చేదు అనుభవాల నుంచి తొందరగా బయటపడేందుకు ఉపయోగపడుతుంది. ఆందోళనల్ని దరిచేరకుండా యాప్‌ సాయంతో ధ్యానం చేయొచ్చు. విభాగాలుగా దీంట్లో అందుబాటులో ఉంచిన కంటెంట్‌ని యాక్సెస్‌ చేయొచ్చు. మీకెంత నిడివితో కూడిన ‘మెడిటేషన్‌ సెషన్స్‌’ కావాలో సెలెక్ట్‌ చేసుకుని సాధన చేయొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌:
http://bit.ly/3mV8IOF


 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని