యాప్‌లనూ పంపొచ్చు

ఒక ఫోన్‌ నుంచి మరో దాంట్లోకి డేటాని పంపాలంటే? గతంలో షేర్‌ఇట్‌ లాంటి యాప్‌లను వాడిన విషయం గుర్తుండే ఉంటుంది. యాపిల్‌ యూజర్లకు ఎయిర్‌డ్రాయిడ్‌ ప్రత్యేకం. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఏం వాడుతున్నారు? గూగుల్‌ ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ‘నియర్‌బై షేర్‌’.

Updated : 24 Feb 2021 17:52 IST

ఒక ఫోన్‌ నుంచి మరో దాంట్లోకి డేటాని పంపాలంటే? గతంలో షేర్‌ఇట్‌ లాంటి యాప్‌లను వాడిన విషయం గుర్తుండే ఉంటుంది. యాపిల్‌ యూజర్లకు ఎయిర్‌డ్రాయిడ్‌ ప్రత్యేకం. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఏం వాడుతున్నారు? గూగుల్‌ ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ‘నియర్‌బై షేర్‌’. గత ఏడాది పరిచయం చేసిన ఈ ఫీచర్‌తో ఇప్పటి వరకూ ఫొటోలు, ఫైల్స్‌, యూఆర్‌ఎల్‌ లింక్స్‌ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ఇకపై ఆండ్రాయిడ్‌ యాప్‌లనూ ‘నియర్‌బై షేర్‌’తో పంచుకోవచ్చు. సెల్యులర్‌, వై-ఫై నెట్‌వర్క్‌లతో పని లేకుండానే నియర్‌బై షేర్‌ పని చేస్తుంది. ఎప్పుడైనా యాప్‌లను ఇతరులకు పంపాలనుకుంటే ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేసి ‘మై యాప్స్‌ అండ్‌ గేమ్స్‌’లోకి వెళ్తే ‘షేర్‌ యాప్స్‌’ కనిపిస్తుంది. దాంట్లోని ‘సెండ్‌, రిసీవ్‌’ కమాండ్స్‌తో యాప్‌లను పంపొచ్చు. ఇతరులు పంపిన వాటిని రిసీవ్‌ చేసుకోవచ్చు. యాప్‌లను పంపే క్రమంలో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లన్నీ జాబితాగా కనిపిస్తాయి. వాటిల్లో నుంచి కావాల్సినవి ఎంపిక చేసుకోవచ్చు.

నియర్‌బై షేర్‌ యాక్సెస్‌ ఇలా...

ఏదైనా డేటాని గూగుల్‌ అందించే ఈ ప్రత్యేక ఆప్షన్‌తో పంపాలనుకుంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ వచ్చిన ఆప్షన్స్‌లో ‘గూగుల్‌’ మెనూని సెలెక్ట్‌ చేస్తే.. ప్రత్యేక సర్వీసుల జాబితా కనిపిస్తుంది. దాంట్లో ‘డివైజ్‌ కనెక్షన్స్‌’ తాకితే ‘నియర్‌బై షేర్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. సదుపాయాన్ని వాడుకుందాం అనుకుంటే ‘ఎనేబుల్‌’ చేయాలి. తర్వాత అందుబాటులో ఉన్న ఫోన్‌కి డేటాని సులభంగా షేర్‌ చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని