
పాటల మార్పిడి ఇలా..
మరింత స్పష్టంగా, వివిధ దిక్కుల నుంచి సంగీతం వినిపించేలా యాపిల్ మ్యూజిక్ ఇటీవల కొన్ని మార్పులు చేసింది. స్పోటిఫై వినియోగదారులు కొందరిని బాగా ఆకట్టుకుంటోంది. కాకపోతే యాపిల్ మ్యూజిక్‌కు మారిపోతే ఇంతకాలంగా సృష్టించుకున్న ప్లేలిస్టులు పోతాయేమోనని భయం. ఇవన్నీ ఆయా సందర్భాలకు పనికి వచ్చేలా సృష్టించుకున్నవాయె మరి. కొత్త సర్వీసులో చేరితే ఒకో పాటను, ప్లేలిస్టును మార్చుకోవాల్సి ఉంటుంది. ఇదంత సులువు కాదు. అయితే దీనికో తేలికైన మార్గముంది. అదే సాంగ్‌షిఫ్ట్ యాప్. దీన్ని యాప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాపిల్ మ్యూజిక్, స్పోటిఫై అకౌంట్లు రెండింటితో దీనికి కనెక్ట్ కావాలి. అనంతరం యాపిల్ మ్యూజిక్‌లోకి మార్చుకోవాలని అనుకుంటున్న పాటలు, ఆల్బమ్‌లు, ప్లేలిస్టులను ఎంచుకొని, క్లిక్ చేయాలి. అంతే కొద్ది నిమిషాల్లోనే అన్నీ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. సాంగ్‌షిఫ్ట్ యాప్ పెయిడ్ సర్వీసులోనైతే ఇంకాస్త వేగంగానూ మార్పిడి చేసుకోవచ్చు. కావాలంటే సౌండిజ్ యాప్‌నూ ప్రయత్నించొచ్చు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవద్దనుకుంటే ఇన్-బ్రౌజర్ రూపంలోనూ వాడుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.