
ఇన్‌స్టాలో మ్యూజిక్
మెటాకు చెందిన ఫొటో షేరింగ్ వేదిక ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా సంగీతం ఫీచర్ మీద పరీక్షలు ఆరంభించింది. భారత్‌తో పాటు బ్రెజిల్, టర్కీల్లో దీనిపై పరీక్షలు నిర్వహిస్తోంది. ఫీడ్ పోస్టులకు ఇష్టమైన సంగీత సొబగులను అద్దుకునే వెసులుబాటు కల్పించటం దీని ఉద్దేశం. దీంతో రీల్స్, స్టోరీల వీడియోలకు మాదిరిగానే ఫీడ్ పోస్ట్‌లకూ ఇకపై సంగీతాన్ని జోడించుకోవచ్చన్నమాట. ఏదైనా పాటను క్లిక్ చేస్తే దాన్ని వాడుకుంటున్న ఫీడ్ పోస్ట్‌లన్నీ కనిపిస్తాయి. ప్రస్తుతానికి చాలా తక్కువమందితోనే దీన్ని పరీక్షిస్తున్నారు. ఫలితాలను బట్టి విస్తరించటం మీద నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా.. ఏదైనా సమస్య ఎదురైతే త్వరగా రిపోర్టు చేయటానికి తోడ్పడే రేజ్ షేక్, ఫొటోల గుచ్ఛం నుంచి ఒక ఫొటోను డిలీట్ చేయటానికి ఉపయోగపడే ఫైనల్లీ ఫీచర్లనూ ఇన్‌స్టా ప్రవేశపెట్టింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.