
విండోస్ 11కు అనుగుణంగా క్రోమ్
విండోస్ 10 కన్నా విండోస్ 11 భిన్నంగా కనిపిస్తుంది. గుండ్రటి మూలలు, ఒకింత పాదర్శక ఎఫెక్ట్‌లతో మరింతగా కనువిందు చేస్తుంది. మరి ఈ కొత్త డిజైన్‌కు అనుగుణంగా క్రోమ్ బ్రౌజర్ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇటీవల విడుదలైన గూగుల్ క్రోమ్ 96లో ప్రయోగాత్మక విండోస్ 11 మోడ్ కూడా ఉంది. మరి ఈ కొత్త డిజైన్‌ను ఎనేబుల్ చేసుకోవటమెలా?
* ముందు క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, అడ్రస్ బార్‌లో chrome://flags అని టైప్ చేసి, ఎంటర్ చేయాలి. తర్వాత ‘విండోస్ 11’ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన స్టైల్ మెనూ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకొని, రీలాంఛ్ బటన్‌ను నొక్కాలి. అప్పుడు మార్పులన్నీ అప్లై అవుతాయి. బ్రౌజర్ కొత్తగా దర్శనమిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.