బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ మూసేస్తున్నారా?

ఫోన్‌లో తరచూ రీసెంట్‌ యాప్స్‌ ఫీచర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తుంటాం. వాడకపోయినా వెనకాల ఇవి అలాగే రన్‌ అవుతుంటే బ్యాటరీని ఖర్చు చేస్తాయని, ఎక్కువ డేటా తీసుకుంటాయని, ఫోన్‌ వేగం తగ్గుతుందని భావిస్తుంటాం. ఆండ్రాయిడ్‌ ఫోన్ల విషయంలో బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ.

Updated : 22 Dec 2021 05:21 IST

ఫోన్‌లో తరచూ రీసెంట్‌ యాప్స్‌ ఫీచర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తుంటాం. వాడకపోయినా వెనకాల ఇవి అలాగే రన్‌ అవుతుంటే బ్యాటరీని ఖర్చు చేస్తాయని, ఎక్కువ డేటా తీసుకుంటాయని, ఫోన్‌ వేగం తగ్గుతుందని భావిస్తుంటాం. ఆండ్రాయిడ్‌ ఫోన్ల విషయంలో బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ. యాప్స్‌ పనిచేయటానికి ఆండ్రాయిడ్‌ను రూపొందించిన తీరు గురించి తెలిస్తే ఇది నిజమేనని అంగీకరించక తప్పదు. బ్యాక్‌గ్రౌండ్‌ మెమరీలో యాప్స్‌ ఉండే విధంగానే ఆండ్రాయిడ్‌ను రూపొందించారు. అంతేకాదు, అవసరమైనప్పుడు తనకు తానే యాప్స్‌ను క్లోజ్‌ చేసుకునేలా తయారుచేశారు కూడా. అందువల్ల మనం పని గట్టుకొని క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్‌ ఉండటం వల్ల మరో ప్రయోజనం ఓపెన్‌ చేసినప్పుడు అవి త్వరగా లాంచ్‌ అవుతాయి. బ్యాటరీని ఎక్కువగా వాడుకోకుండానే పనిచేస్తాయి. అదే తరచూ యాప్స్‌ను క్లోజ్‌ చేస్తూ, ఓపెన్‌ చేస్తున్నట్టయితే తిరిగి మొదట్నుంచీ పని ఆరంభించాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ బ్యాటరీని తీసుకుంటాయి. ఇది సీపీయూ మీదా భారం పడేలా చేస్తుంది. అలాగని యాప్స్‌ను ఎన్నడూ క్లోజ్‌ చేయకూడదని కాదు. సరిగా పనిచేయకపోతున్నా, ఏదైనా లోడ్‌ కావటానికి ఎక్కువసేపు పడుతున్నా, అసలు పనిచేయటానికే మొరాయిస్తున్నా యాప్‌ను క్లోజ్‌ చేయక తప్పదు. ఫోన్‌ను రీస్టార్ట్‌ చేస్తే ఇంకా మంచిది. రీసెంట్‌ యాప్స్‌ పద్ధతితోనే కాదు.. సెటింగ్స్‌లోని యాప్స్‌ విభాగంలోకి వెళ్లి ఫోర్స్‌ స్టాప్‌, ఫోర్స్‌ క్లోజ్‌ ఆప్షన్ల ద్వారానూ యాప్స్‌ను క్లోజ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని