ఆండ్రాయిడ్‌ రహస్యం

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఆశ్చర్యాల గని! దీనిలోని ట్రిక్స్‌ గురించి.. ముఖ్యంగా రహస్య సంకేతాల గురించి తెలిస్తే ‘ఔరా’ అనాల్సిందే. ‘ఇప్పటివరకూ ఈ విషయం నాకెందుకు తెలియలేదబ్బా’ అని ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఆండ్రాయిడ్‌ రహస్య సంకేతాల ద్వారా

Updated : 26 Jan 2022 05:54 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఆశ్చర్యాల గని! దీనిలోని ట్రిక్స్‌ గురించి.. ముఖ్యంగా రహస్య సంకేతాల గురించి తెలిస్తే ‘ఔరా’ అనాల్సిందే. ‘ఇప్పటివరకూ ఈ విషయం నాకెందుకు తెలియలేదబ్బా’ అని ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఆండ్రాయిడ్‌ రహస్య సంకేతాల ద్వారా సెటింగ్స్‌లోతుల్లోకి వెళ్లకుండానే కొన్ని పనులు చేసుకోవచ్చు. సాధారణంగా ఇవి *, # గుర్తులతో మొదలవుతాయి. అయితే ఈ రహస్య సంకేతాలు అన్ని ఫోన్లలో ఒకేలా ఉండకపోవచ్చు. కంపెనీల హార్డ్‌వేర్‌ కన్ఫిగరేషన్ల బట్టి మారిపోతుండొచ్చు. వీటిని తెలుసుకొని వాడుకుంటే బాగా ఉపయోగపడతాయి. అలాంటి రహస్య సంకేతాల్లో కొన్ని ఇవీ..


ఫోన్‌ షట్‌ డౌన్‌

ఫోన్‌ సరిగా పనిచేయకపోయినా.. ఏదైనా యాప్‌, ఫీచర్‌ మొరాయిస్తుంటే షట్‌డౌన్‌ చేయాల్సి రావచ్చు. కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఫోన్‌ షట్‌డౌన్‌ కాకపోవచ్చు. వైరస్‌ దాడి చేయటం, షట్‌డౌన్‌ బటన్‌ పనిచేయకపోవటం వంటివి దీనికి కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో *#*#7594#*#* సంకేతాన్ని డయల్‌ చేసి చూడండి.


ఫోన్‌ రీసెట్‌

ఫోన్‌ స్పందించటం మానేసినప్పుడో, వేగం తగ్గినప్పుడో, ఏదైనా అనుమానం వచ్చినప్పుడో ఫోన్‌ను రీసెట్‌ చేయటం తెలిసిందే. ముఖ్యంగా ఫోన్‌ను ఇతరులకు అమ్మినప్పుడు ఫ్యాక్టరీ రీసెట్‌ తప్పనిసరి. లేకపోతే మన డేటా అవతలివారికి చిక్కే ప్రమాదముంది. ఫ్యాక్టరీ రీసెట్‌ చేయటానికీ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో దగ్గరిదారి ఉంది. డయల్‌ ప్యాడ్‌ను ఓపెన్‌ చేసి *2767*3855# అని టైప్‌ చేస్తే సరి.


డేటా, ఎస్‌ఎంఎస్‌ వాడకం తనిఖీ

ప్పుడు డేటా వాడకం ఎంత అమూల్యమైందో చెప్పనవసరం లేదు. అవసరమైనప్పుడు డేటా అయిపోతే ఎంత కష్టమో. అందుకే ఎక్కడ డేటా నిండుకుంటుందోననే భయంతో మితంగా వాడుకుంటుంటాం. ఇక్కడే *3282చి ఉపయోగపడుతుంది. డయల్‌ ప్యాడ్‌ ఓపెన్‌ చేసి దీన్ని టైప్‌ చేస్తే ఎంత డేటా మిగిలి ఉంది? ఎన్ని మెసేజ్‌లు ఉపయోగించుకోవచ్ఛు? అనే సమాచారమంతా ప్రత్యక్షమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని