యూట్యూబ్‌ మారింది

యూట్యూబ్‌ మొబైల్‌ యాప్‌ ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌ కొత్తగా కనిపించటం గమనించే ఉంటారు. అవును కొత్త ఇంటర్ఫేస్‌తో ఇది బాగా ఆకట్టుకుంటోంది. దీంతో వీడియోను లైక్‌, డిస్‌లైక్‌ చేయటం.. కామెంట్లను చూడటం, చూస్తున్న వీడియోను షేర్‌ చేయటం తేలికైంది. పాత వర్షన్‌లో

Published : 16 Feb 2022 00:48 IST

యూట్యూబ్‌ మొబైల్‌ యాప్‌ ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌ కొత్తగా కనిపించటం గమనించే ఉంటారు. అవును కొత్త ఇంటర్ఫేస్‌తో ఇది బాగా ఆకట్టుకుంటోంది. దీంతో వీడియోను లైక్‌, డిస్‌లైక్‌ చేయటం.. కామెంట్లను చూడటం, చూస్తున్న వీడియోను షేర్‌ చేయటం తేలికైంది. పాత వర్షన్‌లో ఈ ఫీచర్లు చాలావరకు మోర్‌ వీడియోస్‌ విభాగంలో కనిపించకుండా ఉండేవి. ఇప్పుడు వీడియో మీద, మధ్యలోనే కనిపిస్తున్నాయి. రిలేటెడ్‌ వీడియోస్‌ బటన్‌ను ఒక మూలకు ఒదిగిపోయి ఉంటుంది. ఈ ఫీచర్లు ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌లోనే ప్రత్యక్షమవుతాయి. పోర్ట్రయిట్‌ మోడ్‌లోనైతే పెద్దగా మార్పేమీ ఉండదు. ల్యాండ్‌స్కేప్‌లో వీడియో ఉన్నప్పుడు కామెంట్స్‌ పక్కనే కనిపిస్తాయి. ఈ కామెంట్స్‌ తెర మీద కనిపించొద్దనుకుంటే క్లోజ్‌ చేసుకోవచ్చు కూడా. ఇంతకుముందైతే వీటిని చూడాలంటే కామెంట్‌ సెక్షన్‌ను ట్యాప్‌ చేయాల్సి వచ్చేది. తర్వాత ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌లోకి మారాల్సి వచ్చేది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ పరికరాలు రెండింటిలోనూ కొత్త యూజర్‌ ఇంటర్ఫేస్‌ ఆరంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని