కూనిరాగంతో పాట శోధన

కొన్నిసార్లు మనసులో పాట మెదులుతూ ఉంటుంది. నోటితో కూనిరాగం తీస్తుంటాం. కానీ పాటలోని పదాలే తటాలున తట్టవు. మరి ఆ పాటను అంతర్జాలంలో వెతకటమెలా? పాట ట్యూన్‌తోనే..

Updated : 02 Mar 2022 06:24 IST

కొన్నిసార్లు మనసులో పాట మెదులుతూ ఉంటుంది. నోటితో కూనిరాగం తీస్తుంటాం. కానీ పాటలోని పదాలే తటాలున తట్టవు. మరి ఆ పాటను అంతర్జాలంలో వెతకటమెలా? పాట ట్యూన్‌తోనే.. అంటే హమ్మింగ్‌తోనే శోధిస్తే పోలా? ఇందుకు https://www.midomi.com/ బాగా ఉపయోగపడుతుంది. దీంతో హమ్‌ చేయటం ద్వారానే ట్రాక్‌ టైటిల్‌ను వెదకొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే డిస్క్‌లాంటి బొమ్మ కనిపిస్తుంది. దీన్ని నొక్కి హమ్‌ చేస్తే రికార్డు అవుతుంది. హమ్మింగ్‌ ఆపేసి అదే బటన్‌ను నొక్కితే ఆ ట్యూన్‌తో ముడిపడిన పాటలను వెతికి, మన ముందుంచుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని