గూగుల్‌ ఫోటోస్‌తోనూ షేరింగ్‌

ఫొటోలు, వీడియోల బ్యాకప్‌ కోసం గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను చాలామంది వాడుకుంటూనే ఉంటారు. కేవలం బ్యాకప్‌ కోసమే కాదు..

Updated : 02 Mar 2022 06:22 IST

ఫొటోలు, వీడియోల బ్యాకప్‌ కోసం గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను చాలామంది వాడుకుంటూనే ఉంటారు. కేవలం బ్యాకప్‌ కోసమే కాదు.. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవటానికీ దీన్ని వాడుకోవచ్చు. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తేలికగా ఫొటోలు, వీడియోలు పంపుకోవచ్చు. ముందుగా గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను తెరవాలి. షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఎంచుకోవాలి. అప్పుడు పైన షేర్‌ బటన్‌ కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేయగానే లింక్‌ క్రియేట్‌ చేసుకోవాలనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఈ లింక్‌ ద్వారా స్నేహితులు, బంధువుల వాట్సప్‌ లేదా జీమెయిల్‌ ఖాతాల వంటి వాటికి షేర్‌ చేసుకోవచ్చు. దీంతో విడివిడిగానే కాదు, ఫొటోల ఆల్బమ్‌ను సృష్టించుకొని కూడా పంపుకోవచ్చు.

* కంప్యూటర్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవాలంటే photos.google.com ఓపెన్‌ చేయాలి. గూగుల్‌ అకౌంట్‌తో సైన్‌ ఇన్‌ అవ్వాలి. ఫొటోలు, వీడియోలను కర్సర్‌తో ఎంచుకొని, షేర్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. ‘సెండ్‌ ఇన్‌ గూగుల్‌ ఫొటోస్‌’ విభాగం కింద షేర్‌ చేయాలనుకునేవారిని ఎంచుకొని, ‘సెండ్‌’ బటన్‌ నొక్కాలి. కావాలంటే పంపించుకునే ఫొటోలు, వీడియోలకు సందేశాలనూ జోడించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని