ఈమెయిల్ ట్రాక్‌లో పడకుండా..
ఇన్‌బాక్స్‌లో మనకు తెలియని, అవసరం లేని ఈమెయిల్స్ ప్రత్యక్షమవటం తరచూ చూసేదే. వీటిల్లో ఆయా వస్తువుల, సేవల ప్రచారానికి సంబంధించినవే ఎక్కువ. అయితే స్పామర్లు, ఫిషర్స్ సైతం ఇలాంటి మెయిళ్లతో వల విసురుతుంటారు. మెయిల్ చిరునామా సరైనదేనా? మెయిళ్లను చదువుతున్నారా? అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. కొన్నిసార్లు ఇది చిక్కుల్లో పడేయొచ్చు.
ఇన్‌బాక్స్‌లో మనకు తెలియని, అవసరం లేని ఈమెయిల్స్ ప్రత్యక్షమవటం తరచూ చూసేదే. వీటిల్లో ఆయా వస్తువుల, సేవల ప్రచారానికి సంబంధించినవే ఎక్కువ. అయితే స్పామర్లు, ఫిషర్స్ సైతం ఇలాంటి మెయిళ్లతో వల విసురుతుంటారు. మెయిల్ చిరునామా సరైనదేనా? మెయిళ్లను చదువుతున్నారా? అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. కొన్నిసార్లు ఇది చిక్కుల్లో పడేయొచ్చు.
అపరిచిత ఈమెయిళ్లను చాలామంది యథాలాపంగానే తెరుస్తుంటారు. తమకు సంబంధించినవి కాకపోయినా ఆసక్తి కొద్దీ ఏముందోనని చూస్తుంటారు. కానీ ఇలాంటి మెయిళ్లలో ఎక్కడో ఒకచోట అదృశ్యంగా ఒక పిక్సెల్‌తో కూడిన చిన్న ఇమేజ్ ట్రాకర్ ఉంటుందనే సంగతి తెలుసుకోలేరు. మెయిల్‌ను క్లిక్ చేయగానే ఇది మనకు సంబంధించిన బోలెడంత డేటాను సేకరిస్తుంది. మెయిల్‌ను ఎప్పుడు ఓపెన్ చేశారు? చదివారా, లేదా? మెయిల్లోని లింకులను క్లిక్ చేశారా? ఇలాంటి వివరాలన్నింటినీ పంపించినవారికి చేరవేస్తుంది. మరి ఇలాంటి ఈమెయిల్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవటమెలా? దీనికి తేలికైన మార్గం- మెయిల్‌ను తెరచినప్పుడు అందులోని ఫొటోలు వాటంతటవే డౌన్లోడ్ కాకుండా చూసుకోవటం. నిజానికి చాలా బ్రౌజర్లు ఇందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తాయి. పర్మిషన్స్‌ను మార్చుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది తీవ్రమైన చర్య. ఒకరకంగా ఇది ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను ‘చప్పిడి కూడు’లా మార్చేస్తుంది. అయినా సరే అనుకుంటే ప్రయత్నించి చూడొచ్చు. గూగుల్ క్రోమ్ వాడేవారు పైన కుడివైపు చివరన నిలువు మూడు చుక్కలను నొక్కి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విభాగం ద్వారా సైట్ సెటింగ్స్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్ చేసి ఇమేజెస్ విభాగం కింద ‘అడిషనల్ పర్మిషన్స్’ మీద క్లిక్ చేయాలి. ఇమేజెస్ పేజీ మీద ‘డోన్ట్ అలో సైట్స్ టు షో ఇమేజెస్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఏవైనా సైట్ల ఇమేజ్‌లు కనిపించాలనుకుంటే ఆయా సైట్లను జోడించుకునే వెసులుబాటూ ఉంటుంది.
ఎక్స్టెన్షన్ల సాయం
ఈమెయిల్ ట్రాకింగ్‌ను అడ్డుకోవటానికి మంచి పద్ధతి యాంటీ ట్రాకింగ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్లను ఇన్స్టాల్ చేసుకోవటం. పిక్సెల్ బ్లాక్, పిక్సెల్ బ్లాక్ 2, ట్రాకర్ వంటివి జీమెయిల్ ట్రాకింగ్‌ను నిలువరించటానికి ఉపయోగపడతాయి. వీటిని క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి పొందొచ్చు. ఇవి ఈమెయిళ్లలోని ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించి, అడ్డుకుంటాయి. ట్రాకింగ్ పిక్సెల్‌ను గుర్తించగానే మెయిల్‌ను పంపించినవారి పేరు పక్కన ఎర్రటి కన్ను గుర్తు కనిపించేలా చేస్తాయి. క్రోమ్, ఫైర్ఫాక్స్, ఎడ్జ్ వంటి బ్రౌజర్లకు ‘క్లియర్ యూఆర్ఎల్’ యాడ్ ఆన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్రౌజర్లో నిక్షిప్తమై పోతాయి. బ్రౌజర్, ఇన్‌బాక్స్‌లోని ప్రతీ లింక్ నుంచి ట్రాకింగ్ చెత్తను నిశ్శబ్దంగా తొలగించేస్తాయి. https://docs.clearurls.xyz/1.22.0/ నుంచి వీటిని యాడ్ చేసుకోవచ్చు.\
* రీడ్ రిసీప్ట్స్, ఇతర ఈమెయిల్ ట్రాకింగ్ పిక్సెల్స్‌ను అడ్డుకోవటానికి ‘అగ్లీ ఈమెయిల్’ అనే ఓపెన్-సోర్స్ జీమెయిల్ ఎక్స్టెన్షన్ సైతం ఉపయోగపడుతుంది. ఇది ఇన్‌బాక్స్‌ను స్కాన్ చేసి, పిక్సెల్స్‌తో కూడిన ఈమెయిళ్లు ఉన్నాయేమో గమనిస్తుంది. పిక్సెల్ ఉన్నట్టు గుర్తిస్తే మెయిళ్లను కనుగుడ్డు ఆకారంతో లేబుల్ చేస్తుంది. పిక్సెల్‌ను అడ్డుకుంటుంది. ఫైర్ఫాక్స్ వాడేవారు దీన్ని https://addons.mozilla.org/en-US/firefox/search/?q=ugly%20email. నుంచి యాడ్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ క్లయింట్లతో..
ఎక్స్టెన్షన్లు వద్దనుకుంటే ఇమేజ్‌లు వాటంతటవే డౌన్లోడ్ కాకుండా ఈమెయిల్ క్లయింట్లను కన్ఫిగర్ చేసుకోవచ్చు. వెబ్ బ్రౌజర్లో జీమెయిల్‌ను తెరచి, పైన కుడివైపున గేర్ గుర్తును క్లిక్ చేయాలి. జనరల్ ట్యాబ్ కింద ‘సీ ఆల్ సెటింగ్స్’ మీద క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి, ఇమేజెస్ విభాగంలో ‘ఆస్క్ బిఫోర్ డిస్‌ప్లేయింగ్ ఎక్స్టర్నల్ ఇమేజెస్’ బాక్స్‌ను ఎంచుకోవాలి.
* మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ వాడేవారైతే బ్రౌజర్లో సైన్ ఇన్ కావాలి. గేర్ గుర్తును నొక్కి సెటింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ‘వ్యూ ఆల్ అవుట్‌లుక్ సెటింగ్స్’ మీద క్లిక్ చేయాలి. ఎడమవైపు కనిపించే జాబితాలో ‘జనరల్’ విభాగంలో ‘ప్రైవసీ అండ్ డేటా’ను ఎంచుకోవాలి. కిందికి స్క్రోల్ చేస్తే ‘ఎక్స్టర్నల్ ఇమేజెస్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో ‘ఆల్వేస్ యూజ్ ద అవుట్‌లుక్ సర్వీస్ టు లోడ్ ఇమేజెస్’ పక్కన చెక్ మార్కును పెట్టుకోవాలి. ఇది పూర్తిగా పిక్సెల్ ట్రాకింగ్‌ను అడ్డుకోలేదు కానీ ఇతరత్రా మార్గాల్లో భద్రత కల్పిస్తుంది.
యాపిల్ పరికరాల్లో తేలికగా..
గోప్యతను కాపాడే విషయంలో యాపిల్ హైడ్ మై ఈమెయిల్, ప్రైవేట్ రిలే వంటి ఫీచర్లతో ఎప్పుడూ ముందంజలోనే ఉంది. ఐఫోన్, మ్యాక్ఓఎస్లోని మెయిల్ యాప్‌కు చెందిన ‘ప్రొటెక్ట్ మెయిల్ యాక్టివిటీ’ ఫీచర్ పిక్సెల్ ట్రాకింగ్‌ను నిలువరించటానికి బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్‌ఓఎస్‌లో మెయిల్ యాప్‌ను ఓపెన్ చేసి, మెనూ ద్వారా మెయిల్ మీద క్లిక్ చేయాలి. ప్రిఫరెన్స్లోకి వెళ్లి వ్యూయింగ్ ట్యాబ్ కింద ఉండే ‘లోడ్ రిమోట్ కంటెంట్ ఇన్ మెసేజెస్’ను అన్‌చెక్ చేయాలి. అదే ఐఫోన్, ఐప్యాడ్‌లోనైతే సెటింగ్స్ ద్వారా మెయిల్లోకి వెళ్లాలి. ప్రైవసీ ప్రొటెక్షన్ విభాగంలో ‘ప్రొటెక్ట్ మెయిల్ యాక్టివిటీ’ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇవి ఐపీ చిరునామాను అదృశ్యం చేయటం వంటి చర్యలతో రక్షణ కల్పిస్తాయి. మెసేజెస్ను ఓపెన్ చేయకపోయినా బ్యాక్‌గ్రౌండ్ నుంచే పనిచేస్తాయి. అనుచిత మెయిళ్లను పంపించేవారి కంటపడకుండా చూస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
ఫైల్స్‌లో స్కాన్!
డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్ చేయటానికి గూగుల్ ఫైల్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. -
డాక్స్‌లో పాత వర్షన్ కావాలంటే?
గూగుల్ డాక్స్‌లో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం. షేర్ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. -
టాయ్‌లెట్ ఎక్కడ?
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయ్లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. -
ఫ్లాష్ నోటిఫికేషన్లు ఇలా..
ఫోన్ సైలెంట్లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్ లైట్ అలర్ట్‌ను సెట్ చేసుకుంటే చాలు. -
లెక్కల్లో గూగుల్ సాయం
లెక్కలంటే చాలామంది విద్యార్థులకు హడల్. ఒకపట్టాన అర్థం కాకపోవటం, తగినంత సాధన చేయకపోవటం వల్ల గణిత సూత్రాలు, నిబంధనలు గుర్తుండవు. దీంతో లెక్కలను చేయటం కష్టమైపోతుంది. -
విండోస్‌లోనూ ఏఐ ఎరేజ్
గూగుల్, సామ్సంగ్ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా జనరేటివ్ ఎరేజ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. -
ఛాట్‌జీపీటీతో ఏఐ టూల్స్ జాబితా
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది. -
పెయింట్‌లోనే ఏఐ!
పదాల కూర్పుతో (ప్రాంప్ట్) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్ఇన్ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు -
అంధులకు దారిచూపు
కొత్త భవనాల్లోకి వెళ్తే కళ్లు కనిపించినా తికమక పడతాం. ఇక చూపు కోల్పోయినవారైతే? ఇలాంటివారికి తోడ్పడే రెండు ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్ యాప్‌లను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు -
మెసేజెస్ నుంచే ఫొటో షేర్
ఫోన్లో ఎవరికైనా ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్తాం. వాటిని గుర్తించాక కాంటాక్టులను వెతికి షేర్ చేస్తుంటాం. ఐఫోన్ వాడేవారైతే మరింత త్వరగా మెసేజెస్ ద్వారానే దీన్ని కానియ్యొచ్చు -
యాప్ మాటలు వింటోందా?
ఫోన్లో ఏదో మాట్లాడతాం. అనంతరం ఏదో వెబ్సైట్ చూస్తుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఫోన్లో మాట్లాడే మాటలు యాప్‌లు వింటున్నాయనే అనుమానం వస్తుంటుంది. -
గూగుల్ కొత్త ఏఐ టూల్స్
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏఐ వేదికలు టెక్నాలజీ రంగాన్ని విస్తృతం చేస్తున్నాయి. గూగుల్ తమ ఏఐ వేదిక బార్డ్ పేరును ‘జెమినీ’గా మార్చింది. అంతేకాదు.. ఇటీవల ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్, మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్, టెక్స్ట్ఎఫ్ఎక్స్ అనే కొత్త ఫీచర్లనూ జోడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!