Whatsapp: ఒకే నంబరుతో రెండు ఫోన్లలో వాట్సప్‌!

బంధువులు, మిత్రులతో ముచ్చటించటానికి.. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవటానికి వాట్సప్‌ యాప్‌ తేలికైన మార్గం. అయితే రెండు ఫోన్లు ఉన్నప్పుడు ఏదో ఒకదానిలోనే దీన్ని వాడుకోవటానికి వీలుంటుంది.

Updated : 09 Mar 2022 07:31 IST

బంధువులు, మిత్రులతో ముచ్చటించటానికి.. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవటానికి వాట్సప్‌ యాప్‌ తేలికైన మార్గం. అయితే రెండు ఫోన్లు ఉన్నప్పుడు ఏదో ఒకదానిలోనే దీన్ని వాడుకోవటానికి వీలుంటుంది. అధికారికంగా వాట్సప్‌ ఖాతాను రెండు ఫోన్లలో వాడుకోవటం అసాధ్యం. అంటే రిజిస్టర్డ్‌ వాట్సప్‌ ఖాతాను వేర్వేరు ఫోన్లలో ఉపయోగించలేమన్నమాట. ఒకవేళ కొత్త ఫోన్‌కు మారితే పాత ఫోన్‌ నుంచి ఖాతాను డీయాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది. డేటాను బ్యాకప్‌ చేసకొని, కొత్త పరికరంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కానీ ఒక చిన్న చిట్కాతో రెండు ఫోన్లలోనూ వాట్సప్‌ను ఉపయోగించుకోవచ్చు. అదే వాట్సప్‌ వెబ్‌ వర్షన్‌ను వాడుకోవటం. ఇది యాప్‌ మాదిరి అనుభూతిని కలిగించకపోవచ్చు గానీ మెసేజ్‌లు చూసుకోవటం వంటివి మామూలుగా చేసుకోవచ్చు. ఇందుకోసం..

* ఒక ఫోన్‌లో వాట్సప్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఉన్నారనుకోండి మరో ఫోన్‌లో ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. https://web.whatsapp.com లోకి వెళ్లాలి. కుడివైపు నిలువు మూడు చుక్కల బటన్‌ను క్లిక్‌ చేసి డెస్క్‌టాప్‌ సైట్‌ను ఎంచుకోవాలి. దీంతో మరో పరికరంతో లింక్‌ కావటానికి తోడ్పడే క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది.
* తర్వాత మొదటి ఫోన్‌లో వాట్సప్‌ను ఓపెన్‌ చేయాలి. పైన కుడివైపు మూడు చుక్కల మెనూ ద్వారా ‘లింక్‌ ఎ డివైస్‌’ ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి. అప్పుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. రెండో ఫోన్‌తో ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో రెండో ఫోన్‌లో అదే వాట్సప్‌ ఖాతా ఓపెన్‌ అవుతుంది. ఇలా ఒకే వాట్సప్‌ నంబరుతో రెండు ఫోన్లలో ఖాతాను వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని