గూగుల్‌ మ్యాప్స్‌లో త్వరలో టోల్‌ వివరాలు!

గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రయాణాల తీరే మారిపోయింది. తెలియని ప్రదేశానికి వెళ్లాలన్నా.. తెలిసిన దారిలోనూ గమ్యం ఎంత దూరంలో ఉంది? ప్రయాణానికి ఎంత సేపు పడుతుంది?

Published : 13 Apr 2022 01:33 IST

గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రయాణాల తీరే మారిపోయింది. తెలియని ప్రదేశానికి వెళ్లాలన్నా.. తెలిసిన దారిలోనూ గమ్యం ఎంత దూరంలో ఉంది? ప్రయాణానికి ఎంత సేపు పడుతుంది? అనేవి తెలుసుకోవాలన్నా అందరికీ ఇదే శరణ్యం. కార్లలోనే కాదు, బైక్‌ మీద వెళ్తున్నప్పుడూ ఎంతోమంది దీన్ని వాడుతూనే ఉంటారు. ఇది పెట్రోలు బంకులు, బ్యాంకులు, ఏటీఎంలు, హోటళ్ల వంటివి ఎక్కడెక్కడున్నాయో కూడా చూపిస్తుంది. అంతేనా? గూగుల్‌ మ్యాప్స్‌ టోల్‌గేట్ల వివరాలనూ చూపించనుంది. మనదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రయాణిస్తున్న దారిలో ఎక్కడెక్కడ టోల్‌గేట్లు ఉన్నాయో, ఎక్కడ ఎంత రుసుము వసూలు చేస్తారో ముందే చూపిస్తుంది. దీంతో ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. కావాలంటే ఇది టోల్‌గేట్స్‌ లేని ప్రత్యామ్నాయ దారినీ చూపిస్తుంది. మరికొద్ది వారాల్లో ట్రాఫిక్‌ లైట్ల వివరాలు సైతం ఇందులో అందుబాటులోకి రానున్నాయి. వీటి సాయంతో ఆయా దారుల్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్‌ లైట్లు ఉన్నాయి? అక్కడ ఎంత సేపు ఆగాల్సి వస్తుంది? అనేవి ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రయాణానికి ఎంతసేపు పడుతుందో అంచనా వేసుకోవచ్చు. ఈ సదుపాయాలు ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ రెండింటిలోనూ అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని